Thursday, October 29, 2026
HomeLATESTChiranjeevi:ఓటీటీలోకి టాక్ షోతో చిరంజీవి ఎంట్రీ.. అధికారికంగా ప్రకటన వచ్చేసిందిగా!

Chiranjeevi:ఓటీటీలోకి టాక్ షోతో చిరంజీవి ఎంట్రీ.. అధికారికంగా ప్రకటన వచ్చేసిందిగా!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా వ్యవహరిస్తున్న మెగావార్స్ టాక్ షో కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ నెట్ఫ్లిక్స్ నుండి వచ్చేసింది.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలలోనే కాకుండా , ఓటీటీలో కూడా టాక్ షోకి హోస్టుగా రావడానికి సిద్ధమయ్యారు. చిరంజీవి కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ కోసం హోస్టుగా మారబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మెగావార్స్ పేరుతో సెలబ్రిటీ టాక్ షో చేయబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

మెగావార్స్ షోతో చిరు సందడి..

ఇప్పుడు తాజాగా ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన నెట్ ఫ్లిక్స్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ టాక్ షో ను దాదాపుగా 12 నుంచి 15 ఎపిసోడ్ ల వరకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా గెస్టులుగా వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఒక ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ గా నిర్వహించిన సెట్ లో చిత్రీకరించినట్లు సమాచారం. బ్రహ్మానందం, సత్య, సునీల్ తో కలిసి ఒక ఎపిసోడ్ షూటింగ్ జరిగినట్లు వినిపిస్తోంది. ఈ టాక్ షోలో చాలా కామెడీతోపాటు పలు ఆసక్తికరమైన విషయాలను కూడా చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:Nara Rohit:త్రివిక్రమ్, తమన్ పై నారా రోహిత్ కంప్లైంట్..!

కమలహాసన్ ఫస్ట్ గెస్ట్..

ఇదంతా ఇలా ఉంటే మెగావార్స్ లో మొదటి గెస్ట్ గా హీరో కమలహాసన్ రాబోతున్నట్లు వినిపిస్తోంది. కమల్ హాసన్ హైదరాబాద్ కి రావడంతో ఈ షూట్ కోసమే వచ్చారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం ఇద్దరు లెజెండ్స్ ఓకే స్క్రీన్ పైన కనిపించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ షోకు సంబంధించిన అధికారికంగా నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

also read:Keerthy Suresh:హీరోయిన్ కీర్తి సురేష్ కి వేధింపులు?

చిరంజీవి సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో కాకా సినిమా రాబోతోంది. ఈ సినిమా జనవరి 13 ,2027న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో కూడా ఒక సినిమాని అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి మళ్లీ ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. డైరెక్టర్ వశిష్ట, చిరంజీవి కాంబినేషన్లో ఎప్పుడో మొదలు పెట్టిన సినిమా విశ్వంభర. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతోందని వార్తలు వినిపించాయి.. విఎఫ్ఎక్స్ కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ మళ్లీ రీ షూట్ చేశారనే విధంగా కూడా వినిపించాయి. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది కాకా సినిమా మాత్రమే అభిమానులను అలరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you