Saturday, October 31, 2026
HomeLATESTRakul Preet Singh:శూర్పణఖ పాత్ర పై రకుల్ ప్రీతిసింగ్ షాకింగ్ కామెంట్స్..!

Rakul Preet Singh:శూర్పణఖ పాత్ర పై రకుల్ ప్రీతిసింగ్ షాకింగ్ కామెంట్స్..!

Rakul Preet Singh : ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రామాయణ సినిమాలో శూర్పణఖ పాత్ర పై పలు కామెంట్లు చేసింది.

on
- Advertisement -banner Ad

Rakul Preet Singh:ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోలకు జోడిగా ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పెద్దగా తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలలో కనిపించలేదు. కేవలం బాలీవుడ్ లోనే పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది. అయినా అక్కడ సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. ముఖ్యంగా తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పలు చిత్రాలను నిర్మిస్తోంది.

శూర్పణఖ పాత్రపై రకుల్ కామెంట్స్..

ఇప్పుడు తాజాగా డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రామాయణంలో శూర్పణఖ పాత్రలో నటించబోతోంది. ఈ సినిమా నవంబర్ 5 న 2026న రిలీజ్ కాబోతోంది. రకుల్ ప్రీతిసింగ్ సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. యువరాణి శూర్పణఖ అంటూ విడుదల చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రకుల్ ప్రీతిసింగ్ శూర్పనఖ పాత్ర పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పాత్ర చేయడం కూడా తనకు చాలా కొత్త అనుభూతిని కలిగించిందంటూ రకుల్ ప్రీతిసింగ్(Rakul Preet Singh) తెలియజేసింది..

- Advertisement -
Advertisement

also read:Tamannaah:తమన్నా పై నటుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు.. ఆమె ఏమందంటే..?

ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం..

రామాయణం సినిమాలో యుద్ధం జరగడానికి అసలు కారణాలు శూర్పనఖ పాత్ర కూడా చాలా ఉన్నదని.. కానీ ఈ విషయం చాలామందికి సరిగ్గా తెలియదు. అందుకే ఆమెను అందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. ఈ సినిమాలో శూర్పనఖను ఎవరు చూడని ఒక కొత్త యాంగిల్ లో చూపించబోతున్నారని, అలాంటి క్యారెక్టర్ చేయడం కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ రకుల్ ప్రీతిసింగ్ తెలిపారు. తరతరాలుగా మనందరి గుండెల్లో నిలిచిపోయిన ఇంత పెద్ద కథలో భాగం కావడం కూడా తనకు చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి పాత్ర దొరకడం ప్రపంచం మొత్తానికి మన చరిత్ర గొప్పదనాన్ని చూపించే చిత్రంలో నటించే అవకాశం నాకు దొరకడం నా అదృష్టం అని తెరపై నా క్యారెక్టర్ ను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని, చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నానని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్.

- Advertisement -
Advertisement

also read:Roja:కమల్ హాసన్‌తో సినిమా చేయకపోవడానికి కారణం చెప్పిన రోజా.. షాకింగ్ కామెంట్స్!

రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్..

ఈ భారీ ప్రాజెక్టులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. అలాగే రావణాసురుడిగా యశ్ నటించారు. హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ నటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఎలాంటి రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుందో చూడాలి మరి. రకుల్ ప్రీతిసింగ్ కెరటం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వగా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం తదితర చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you