khushitha kallapu:సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక విషయంలో మొదట్లో కొన్ని మార్పులు జరిగాయి. ముఖ్యంగా శ్రీలీల చెల్లెలి పాత్ర కోసం తొలుత మరో నటిని అనుకున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శ్రీలీల చెల్లి పాత్రకు కుషిత కల్లాపు ఎంపిక :
సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కుషిత కల్లాపు పేరు అప్పట్లో ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీలకు చెల్లెలి పాత్రలో నటించే అవకాశం మొదట ఆమెకు వచ్చింది. కేవలం అవకాశం రావడమే కాకుండా, ఆమెతో కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా నిర్వహించారు కూడా. దీనికి సంబంధించిన విషయాలను కుషిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా పంచుకోవడంతో ఈ వార్త అప్పట్లో చర్చనీయాంశమైంది.
also read:Ramayana Movie Review:రామాయణం మూవీ రివ్యూ.. రావణుడిగా యష్ విశ్వరూపం.. సినిమా ఎలా ఉందంటే?
చివరి నిమిషంలో మారిన నిర్ణయం!:
అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ పాత్ర విషయంలో అనూహ్యమైన మార్పు చోటుచేసుకున్నాయి. కుషిత(khushitha kallapu) నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కు సంబంధించి కొన్ని అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా శ్రీలీలతో పోలిస్తే కుషిత మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోందని ఎవరో అభిప్రాయపడటంతో పాత్ర ఎంపికపై చర్చ మొదలైందనే టాక్ వినిపించింది.
దీంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుని.. అప్పటికే షూటింగ్ చేసిన కుషితను పక్కన పెట్టి, ఆ పాత్ర కోసం మరో నటిని ఎంపిక చేసారట. అయితే ఈ మార్పునకు ఇదే కారణమని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం మారుమ్రోగిపోతుంది.
also read:Rakul Preet Singh: దీపావళికి ముందే గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్!
కుషిత స్థానంలో హాసినికి అవకాశం :
చివరకు శ్రీలీల చెల్లెలి పాత్రలో హాసిని కనిపించింది. సినిమా విడుదలైన తర్వాత ఈ పాత్రలో హాసిని నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం కుషితను ఎంపిక చేసి, ఆమెతో షూటింగ్ కూడా చేసినట్లు వచ్చిన వార్తలు మాత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.
మొత్తానికి ‘గుంటూరు కారం’ సినిమా తెరవెనుక జరిగిన ఈ క్యాస్టింగ్ మార్పు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. ఒక సినిమాలో చిన్న పాత్ర కోసం కూడా చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. అయితే కుషిత స్థానంలో హాసినిని తీసుకోవడానికి గల అసలు కారణంపై ఇప్పటికీ అధికారిక స్పష్టత లేదు. తెలుగమ్మాయి అయిన కుషిత సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయింది. అప్పట్లో టిక్‌టాక్ వీడియోలతో తెగ ట్రెండింగ్‌లో ఉండేది. తర్వాత నెమ్మదిగా ఫేమ్ తెచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో చిన్న రోల్స్‌లో కనిపించింది.




