Ramayana Movie:భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణ. ఈ చిత్రం బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రాబోతోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి భాగాన్ని నవంబర్ 5న దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోని ఈ సినిమాకి సంబంధించిన దృశ్యాలు, వీడియో క్లిప్స్ సైతం సోషల్ మీడియాలో బయటికి రావడంతో నిర్మాతలు ప్రత్యేకించి మరి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ముంబై హైకోర్టును ఆశ్రయించిన రామాయణ చిత్ర బృందం..
భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడం చేత రామాయణ సినిమాకి సంబంధించి పాటలు , కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయితే చిత్ర బృందానికి నష్టం కలిగే అవకాశం ఉంటుందని ఈ సమస్యను ముందుగానే పసిగట్టిన చిత్ర బృందం అడ్డుకునేందుకు రామాయణ సినిమా నిర్మాతలు న్యాయపరమైన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ముంబై హైకోర్టు సినిమా పైరసీ అనధికారిక వీడియో క్లిప్స్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకించి ఒక డైనమిక్ ఇంజక్షన్ ఉత్తర్వులను కూడా విడుదల చేసినట్లు వినిపిస్తున్నాయి. ఈ ఉత్తర్వుల వల్ల సినిమా పేరుతో అనధికారికంగా వీడియోలు, లింకులు ఎవరైనా అప్లోడ్ చేస్తే చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడతాయి.
also read:Bigg Boss 10:బిగ్ బాస్ హౌస్ లో భారీ ట్విస్ట్.. రోహిత్ రీ ఎంట్రీ..?
నిర్మాతల నిర్ణయానికి ఆడియన్స్ ప్రశంసలు..
డిసెంబర్ మధ్య వరకు రామాయణ సినిమాకు సంబంధించి పైరసీ లింకులు అనధికారిక కంటెంట్ ని ఎవరైన పోస్టు చేస్తే వారి పైన కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తుంది. పైరసీ నుంచి తమ సినిమాని రక్షించుకోవడంలో నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను ఆనందాన్ని కలిగిస్తుంది. బాలీవుడ్ రామాయణ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కొన్ని సీన్స్ కూడా లీక్ అయ్యాయి, అంతేకాకుండా పలు రకాల ట్రోల్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో కావాలని ఇలాంటివి చేస్తున్నారని చిత్ర బృందం భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
also read:Kamakshi Bhaskarla:కమిట్‌మెంట్ పేరుతో అలా అడుగుతారట.. నటి కామాక్షి బోల్డ్ కామెంట్స్!
రామాయణ సినిమా విశేషాలు..
రామాయణ (Ramayana Movie)చిత్రంలో కన్నడ స్టార్ హీరో యశ్ రావణుడి పాత్రలో పోషిస్తున్నారు. బాలీవుడ్ రామాయణ సినిమా పైన కూడా ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీమియర్ షోలు ఇతర దేశాలలో పడడంతో సినిమాకి సంబంధించిన రివ్యూలను కూడా ఇప్పటికే పలువురు నెటిజన్స్ తెలియజేశారు. ఈ రివ్యూలు అన్నీ కూడా పాజిటివ్గానే వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ తో పాటుగా ప్రముఖ హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మన భారతీయ పురాణ చరిత్రను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేసేలా భారీ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నమిత్ మల్హోత్రా ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు అలాగే హీరో యశ్ కూడా ఇందులో నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు.




