Renu Desai:తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా కంటే కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా పేరు సంపాదించిన రేణూ దేశాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదట కెరియర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ వంటి చిత్రాలలో నటించిన ఈమె.. ఆ తర్వాత వివాహం, పిల్లలు అంటూ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.. అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవారు కావడంతో తిరిగి మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ దేశాయ్. అలా మూడు సంవత్సరాల క్రితం రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో 2023లో ఎంట్రీ ఇచ్చింది.
ధనుష్ కు క్షమాపణలు చెప్పిన రేణూ దేశాయ్..
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించిన హేమలత లవణం అనే పాత్ర మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతో నటిగా బిజీ అవుతుందనుకున్న రేణూ దేశాయ్(Renu Desai) కి అలాంటివి జరగలేదు. ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మరొకసారి వెండితెర పైన కనిపించబోతోంది. ధనుష్, డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఓం చాప్టర్ 1. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీ లీల, మమ్ముట్టి మరి కొంతమంది సెలబ్రిటీలు నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి భార్యగా రేణూ దేశాయ్ నటించింది.
also read:Amitabh Bachchan:బిగ్ బీ కుటుంబానికి గ్యాంగ్ స్టార్ బెదిరింపులు..!
అసలు ఏమైందంటే?
సోమవారం రోజున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో ధనుష్ తో పాటుగా మమ్ముట్టితో సహా చిత్ర బృందం హాజరయ్యారు. స్టేజ్ పైన రేణు దేశాయ్ మాట్లాడుతూ హీరో ధనుష్ కు క్షమాపణలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. అసలు విషయంలోకి వెళ్తే.. ధనుష్ సార్ నాకు తమిళం సరిగ్గా మాట్లాడడం రాదు. సినిమా షూటింగ్ సమయంలో తమిళ తప్పులను చాలా ఓపికగా భరించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.. ఇలా తమిళం సరిగ్గా మాట్లాడలేక ఇబ్బంది పెట్టడంతోనే ధనుష్ క్షమాపణలు చెప్పింది రేణూ దేశాయ్.
also read:Ramu rathod:అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన ఫోక్ సింగర్..!
నాకు నటించడం రాదు..
ఓం సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది శివరాత్రి రోజున నాకు చిత్ర బృందం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ రోజు నేను కామాఖ్య ఆలయంలో ఉన్నాను ఓం సినిమా చాలా పవర్ఫుల్ కాంబినేషన్. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. నాకు నటించడం రాదు . అలాంటిది మమ్ముట్టి గారి ముందు నిలబడి డైలాగులు చెప్పడం అంటే చాలా భయం వేసింది. ఈ నెల 20వ తేదీన మీరందరూ థియేటర్ కి వచ్చి నేను ఎలా నటించాను అనే విషయాన్ని మీరే చెప్పాలి అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నవంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
A cute moment at the #OM Event…!
#RenuDesai says NO when the Anchor invites her daughter #AadhyaKonidela onto the stage. https://t.co/mA7zO1wwDt
— Rangasthalam (@RangasthalamIN) November 16, 2026




