Wednesday, November 18, 2026
HomeINTERVIEWSSri vidhya:డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తా.. జబర్దస్త్ నటి కామెంట్స్..!

Sri vidhya:డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తా.. జబర్దస్త్ నటి కామెంట్స్..!

Sri vidhya: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీవిద్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తా అంటూ కామెంట్లు చేసింది.

on
- Advertisement -banner Ad

Sri vidhya:జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ కామెడీ షో నుంచి చాలామంది కమెడియన్స్ గా , హీరోలుగా, డైరెక్టర్లుగా మారి మంచి విజయాలను అందుకుంటున్నారు. మరి కొంతమంది బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ అందుకునేలా చేస్తోంది. అలా బిగ్ బాస్ ద్వారా అవకాశాలు అందుకున్న చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందుకే సామాన్యులు కూడా బిగ్ బాస్ వైపుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. మరి కొంతమంది అవకాశం వస్తే వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నారు.

డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తా..

ప్రస్తుతం బిగ్ బాస్ పదవ సీజన్ తెలుగులో జరుగుతోంది. ఇప్పటికే 10 వారాల పాటు పూర్తి అయ్యింది. ఇటువంటి తరుణంలోనే తాజాగా జబర్దస్త్ ఫిమేల్ కమెడియన్ గా పేరు సంపాదించిన శ్రీవిద్య బిగ్ బాస్ కి అవకాశం వస్తే వెళ్తారా అంటూ ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో ప్రశ్నించగా? అందుకు శ్రీవిద్య(Sri vidhya) డబ్బులు ఇస్తే బిగ్ బాస్ కి వెళ్తాను. ఛాన్స్ వస్తే ఎందుకు వెళ్ళను.. అసలే హైదరాబాదులో రూమ్ రెంట్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. నీళ్లు రావడం లేదు. కొన్నిసార్లు చేయి కడుక్కోవడానికి కూడా నీరు ఉండడం లేదు.. మినరల్ వాటర్ తోనే అన్ని చేయవలసి వస్తోంది అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement

also read:Sai Pallavi:ఓం సినిమా కోసం అలాంటి పని చేసిన సాయి పల్లవి..!

బిగ్ బాస్ హౌస్లో పాచి పని చేయడానికి కూడా సిద్ధమే..

ఒకవేళ బిగ్ బాస్ నిర్వాహకులు ఛాన్స్ ఇస్తే ఒక మూడు నెలల పాటు అక్కడే ఉండి పాచి పని , వంట పని చేసుకుంటూ పడి ఉంటానని కూడా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఏమి చేసిన కామెంట్స్ కి కొంతమంది నెటిజన్ సైతం ఈమెకు సెలబ్రిటీ లిస్టులో వచ్చే ఏడాది సీజన్ లో ఈమెకు బిగ్ బాస్ లో అవకాశం కల్పించాలని బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే శ్రీవిద్య నటించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు మరింత ఫేమ్ లభించింది.

- Advertisement -
Advertisement

also read:Renu Desai:ధనుష్ కి క్షమాపణలు చెప్పిన రేణూ దేశాయ్..!

అందరిలాగే నాకు కూడా తప్పని కష్టాలు..

ఇదే ఇంటర్వ్యూలో శ్రీవిద్య తాను బీటెక్ పూర్తి చేశానని, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తే బాగా గుర్తింపు సంపాదించుకున్నాను.. ఆ వీడియోలతోనే తనకు జబర్దస్త్ లో అవకాశం లభించింది. అలా తన ఇంటి నుంచి హైదరాబాద్ కి ప్రయాణం అయ్యానని , కానీ ఇంట్లో కేవలం 2000 రూపాయలు మాత్రమే తీసుకొని హైదరాబాద్ కి అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి వచ్చానని, ఈ ప్రయాణంలోనే తాను ₹500 పోగొట్టుకున్నాను, అలా హైదరాబాదులో ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చానని తెలిపింది శ్రీవిద్య. తాను హైదరాబాదులో ఉండడంతో ఊర్లో చాలామందికి నచ్చలేదు. తన తల్లికి రకరకాలుగా ఏవేవో చెప్పి బాధ పెట్టే వారిని తండ్రి లేని పిల్లలను హైదరాబాదులో ఉంచడం మంచిది కాదని అక్కడ ఏం చేస్తుందో ఎక్కడ తిరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ తన తల్లిని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నించారని, వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈ స్థాయికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీవిద్య.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you