Monday, November 23, 2026
HomeLATESTRashmika:రష్మిక ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మైసా సినిమా వాయిదా?

Rashmika:రష్మిక ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మైసా సినిమా వాయిదా?

Rashmika: రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న మైసా సినిమా గురించి అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

on
- Advertisement -banner Ad

Rashmika:తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రష్మిక మందన్న మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఈ ఏడాది తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రణబాలి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. రష్మిక మొదటిసారి నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ చిత్రం మైసా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవీంద్ర దర్శకత్వం వహించగా.. గత కొద్దిరోజులుగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ సినిమా నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేశారు.

వాయిదా పడనున్న మైసా ..

ఇటీవలే విడుదల చేసిన పాటలు కూడా సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ తాజాగా మైసా సినిమా వాయిదా పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన రిలీజ్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు సినిమా నుంచి సాంకేతికంగా విలక్షణమైన యాక్షన్ ఎంపికగా తెరకెక్కిస్తున్న మైసా సినిమా వెండితెరపై ప్రేక్షకులు లీనమయ్యేలా చేసే అనుభూతిని ఆనందించడానికి సిద్ధంగానే ఉంది. ఈ విజన్ లో ప్రేక్షకులు ఎలాంటి రాజీలేకుండా ఆనందించడానికి నవంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, సినిమాని వాయిదా వేయాలని సమిష్టంగా చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Vishnupriya:ఎక్సర్‌సైజ్ చేస్తూనే అందాలు ఆరబోస్తున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫొటోలు వైరల్ !

యాక్షన్ స్టన్స్ తో అదరగొట్టేస్తున్న రష్మిక..

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మైసా చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో రిలీజ్ చేయవలసి ఉంది. ఇందులో రాహుల్ రవీంద్రన్, ఈశ్వరి రావు, సముద్రఖని, రావు రమేష్, కార్తీక్ రంజని, తారక్ పొన్నప్ప తదితర నటీనటులు కీలకమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే మైసా సినిమా ప్రమోషన్స్ కంటెంట్ భారీగా చేయడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో రష్మిక(Rashmika) గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రీతిలో కనిపించబోతోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:thalapathy vijay:అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌లో విజయ్-సంగీత..చివరకు ట్విస్ట్ ఇచ్చిన జంట!

ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో..

ఒక గిరిజన గోండు అమ్మాయి పాత్రలో రష్మిక పాత్ర చాలా పవర్ఫుల్ పాత్రగా ఉంటుందని, ఈ సినిమా నుంచి సాంగ్స్ కూడా విడుదలవ్వగా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమాలోని రీమిక్స్ సాంగ్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మరి భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కాబోతోందని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. మరి త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్మెంట్ చేస్తారేమో చూడాలి మరి. ఏది ఏమైనప్పటికీ రష్మిక నటిస్తున్న మైసా సినిమా పైన భారీగానే అంచనాలు ఉన్నాయి.మరి ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you