Monday, November 23, 2026
HomeLATESTBhogi Movie:భోగి సినిమా ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టేసిన శర్వానంద్..!

Bhogi Movie:భోగి సినిమా ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టేసిన శర్వానంద్..!

Bhogi Movie: శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేశారు. అందులో శర్వానంద్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు

on
- Advertisement -banner Ad

Bhogi Movie:టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సంపత్ నంది ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్, సిటీ మార్, ఓదెల 2 తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం భోగి. ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్ నటించగా.. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో మరో హీరోయిన్ డింపుల్ హయాతి నటిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు తాజాగా నవంబర్ 27న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

ఆకట్టుకుంటున్న భోగి ట్రైలర్..

ఈ సందర్భంగా ఆదివారం రోజున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ టీజర్ విడుదల అయిన తర్వాత హీరో రవితేజ కి, గోపీచంద్ కి, సాయి ధరంతేజ్ కి ప్రత్యేకించి మరి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంక్రాంతికి ముందు వచ్చే భోగి (Bhogi Movie)సినిమా కాదు చెడును చంపిన తర్వాత వచ్చే భోగి అంటూ తెలియజేశారు. ఇందులో శర్వానంద్ నటించిన తీరు చూస్తూ ఉంటే అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Rashmika:రష్మిక ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మైసా సినిమా వాయిదా?

ట్రైలర్ విషయానికి వస్తే.. హై ఇంటెన్సిటీ యాక్షన్ తో పాటుగా భావోద్వేగ సీన్స్, రా అండ్ రస్టిక్ గా భోగి సినిమాని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది. 1960 ప్రారంభంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు చూడని ఒక మాస్ అవతారంలో గంగ అనే పాత్రలో హీరో శర్వానంద్ కనిపించబోతున్నారు. అంతేకాకుండా అతను ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేకించి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Vishnupriya:ఎక్సర్‌సైజ్ చేస్తూనే అందాలు ఆరబోస్తున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫొటోలు వైరల్ !

సినిమా విడుదల ఎప్పుడంటే?

అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పిన డైలాగులు సినిమాకు మరింత హైలెట్గా నిలుస్తున్నాయి. అలాగే డింపుల్ హయాతి చెప్పిన డైలాగులు కూడా మరింత ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. భోగి చిత్రంలో హీరో శర్వానంద్ యాక్టింగ్ చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సినిమా మొత్తం కూడా డి గ్లామరస్ గానే కనిపించబోతున్నట్లు కనిపిస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో హీరో శర్వానంద్ హిట్ కొట్టేలా ఉన్నారంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ ఏడాది నారి నారి నడుమ మురారి, బైకర్ వంటి చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న శర్వానంద్ భోగి సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి. చివరిగా 2024లో మనమే సినిమాలో నటించగా ఈ సినిమా వారి డిజాస్టర్ గా నిలిచింది.. 2026 లో ఒకేసారి మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. భోగి సినిమా తర్వాత తదుపరి సినిమా ఏంటి అనే విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు శర్వానంద్.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you