Dimple Hayathi:టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శర్వానంద్‌తో ఆమె క్లోజ్‌గా కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరి మధ్య కనిపించిన సాన్నిహిత్యం, హావభావాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదైనా ప్రత్యేకమైన బంధం ఉందా? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు డింపుల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది.
సినిమాలతో బిజీగా ఉన్న డింపుల్ హయతి
హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hayathi)టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలోనూ కనిపించారు.
ప్రస్తుతం ఈ అమ్మడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధామోహన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
శర్వానంద్‌తో డింపుల్ వీడియో వైరల్ :
భోగి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డింపుల్ హయతి, శర్వానంద్ కలిసి కనిపించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలు, హావభావాలు, సాన్నిహిత్యం కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
వీడియోలో ఇద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు డేటింగ్ రూమర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో ఈ వీడియో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
also read:Sreeleela:శ్రీలీల ప్రేమాయణం బయటపడిందా.. పుట్టినరోజున సర్‌ప్రైజ్ గిఫ్ట్!
పెళ్లిపై డింపుల్ క్లారిటీ.. ఏమందంటే? :
ఈ వీడియో కింద ఓ నెటిజన్ స్పందిస్తూ.. శర్వానంద్‌కు పెళ్లయింది కదా, డింపుల్ హయతికి కూడా వివాహమైంది కదా? అంటూ కామెంట్ చేశారు. దీనిపై డింపుల్ స్వయంగా స్పందించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని స్పష్టం చేశారు. దీంతో తన వైవాహిక స్థితిపై వస్తున్న సందేహాలకు ఆమె సమాధానం ఇచ్చినట్లయింది.
డింపుల్ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆమె సమాధానాన్ని కొందరు సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
also read:Devara:బుల్లితెరపై దేవర సునామీ.. ఎన్టీఆర్ ఖాతాలో సరికొత్త రికార్డ్!
నిజంగానే డేటింగ్‌లో ఉన్నారా? :
శర్వానంద్‌కు ఇప్పటికే వివాహమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డింపుల్‌తో ఆయన క్లోజ్‌గా కనిపించిన వీడియోపై మరింత చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సరదాగా మెలిగారా? లేక ఇద్దరి మధ్య నిజంగానే ప్రత్యేకమైన స్నేహం ఉందా? అనేది వారికే తెలియాలి. ఏదేమైనా డింపుల్ పెళ్లిపై ఇచ్చిన క్లారిటీ, శర్వానంద్‌తో వైరల్ అవుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.




