Fauzi Movie:పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రాలలో ఫౌజీ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సీతారామం చిత్రం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ఇండిపెండెన్స్ కి సంబంధించి స్టోరీ తో వాస్తవ కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా డిసెంబర్ మూడవ తేదీన విడుదల చేసేలా ఈ ఏడాది ప్లాన్ చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఈ చిత్రం వాయిదా పడింది అనే విధంగా వినిపిస్తున్నాయి.
ఫౌజీ సినిమా నుండి వీడియో లీక్..
త్వరలోనే ఫౌజీ(Fauzi Movie) సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర బృందం అధికారికంగా తెలపనుంది. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26 ఈ సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఫౌజీ సినిమాకి సంబంధించి వన్ మినిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వీడియో క్లిప్ వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఈ వీడియో క్లిప్పును క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. కానీ ఈ క్లిప్ అసలు ఫౌజీ సినిమాదా?కాదా ?అనే విషయం తెలియాల్సి ఉంది.
also read:VK Naresh:సినిమాలకు ప్రాంతీయ ముద్రలా? వీకే నరేష్ సంచలన వ్యాఖ్యలు
ఆకట్టుకుంటున్న లీక్ వీడియో..
ఈ వీడియోలో జవాన్లంతా కూడా ఒకచోట చేరి తుపాకులు చేతిలో పట్టుకొని చాలా సరదాగా ఉత్సాహంతో డాన్సులు చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది . అలాగే ఏదో పాటకు ఆర్మీ క్యాంపులోని తుపాకులతో డాన్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. మొత్తం ఒక నిమిషం 9 సెకండ్లు ఉన్న ఈ వీడియో .. నిజమా లేకపోతే ఫేక్ అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి వందలాదిమంది జవాన్లు కలిసి ఉత్సాహంగా డాన్సులు వేస్తున్న ఈ వీడియో మాత్రం నెట్ ఇంట వైరల్ గా మారింది. ఫౌజీ సినిమా కూడా 1940 కాలంనాటి జరిగేటువంటి స్టోరీ అన్నట్లుగా ఇప్పటికే పోస్టర్లను బట్టి మనం అంచనా వేయవచ్చు.
also read:Mandadi OTT Release:ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 8 నుంచి ‘మండాడి’ స్ట్రీమింగ్!
ఫౌజీ సినిమా విశేషాలు..
ప్రభాస్ ఇందులో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉండనుంది. ఇందులో హీరోయిన్గా ఇమాన్వి నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్ర తదితర నటి నటులు కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ వంటి భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు విడుదలైన అధికారిక పోస్టర్లతో సినిమా పైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి రాబోయే రోజుల్లో ట్రైలర్ టీజర్ తో ఏ విధంగా అంచనాలను పెంచేస్తారో చూడాలి మరి. ప్రభాస్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ తో కల్కి 2, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సినిమా రాబోతోంది.
The Leaked Footage of #Fauzi Movie 📈📈🔥
#Prabhas accidentally Shared this clip on his Instagram Story & suddenly Deleted it🔥 https://t.co/OT3LYtpo7T
— Prabhas Fan (@Itsaprank132511) October 5, 2026




