Tuesday, October 6, 2026
HomeLATESTMandadi OTT Release:ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 8 నుంచి ‘మండాడి’ స్ట్రీమింగ్!

Mandadi OTT Release:ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 8 నుంచి ‘మండాడి’ స్ట్రీమింగ్!

Mandadi OTT Release: సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త వినోదాన్ని అందించేందుకు ఓటీటీ వేదికలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ రెండో వారంలో థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనుండగా..

on
- Advertisement -banner Ad

Mandadi OTT Release: సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త వినోదాన్ని అందించేందుకు ఓటీటీ వేదికలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ రెండో వారంలో థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనుండగా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్, కామెడీ వంటి పలు జానర్లకు చెందిన కంటెంట్ ఈ వారం ప్రేక్షకులను అలరించనుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లైనప్ :

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో పలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మండాడి’ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. సముద్ర తీర ప్రాంతంలో జరిగే పడవ పందేలు, ఇద్దరు స్నేహితుల మధ్య చోటుచేసుకునే విభేదాలు, వాటి చుట్టూ చోటుచేసుకునే పరిణామాలతో ఈ కథ సాగుతుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు.

- Advertisement -
Advertisement

also read: Vijay Deverakonda:రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కావడానికి కారణం అదేనా..?

ఇందులో మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేయనుంది. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో ‘మండాడి’ స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ప్రేక్షకులకు ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement

అదే సమయంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ కూడా అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు మలయాళ డబ్బింగ్ చిత్రం ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’, ఇన్వెస్టిగేటివ్ డ్రామా ‘రిపోర్టింగ్ లైవ్’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

also read: Celebrity Couples: సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే!

- Advertisement -
Advertisement

మరిన్ని సినిమాలు, సిరీస్‌లు :

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారంలో ‘లెస్ ఆఫ్ ఏ స్ట్రేంజర్’, ‘ఇన్‌సైడ్ ద సర్కిల్’, ‘బిలో’, ‘యానిమల్స్’ వంటి చిత్రాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అలాగే ‘హాంటెడ్ హోటల్ సీజన్ 2’, ‘డాక్టర్ ఎక్స్: మాఫియా ఇన్ వైట్’ వంటి సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. కొరియన్ డ్రామాలను ఇష్టపడే వారికి ‘టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్’, ‘100 డేస్ ఆఫ్ డిసెప్షన్’ వంటి సిరీస్‌లు కూడా ఈ వారం అందుబాటులోకి రానున్నాయి.

ప్రైమ్ వీడియోలో హాలీవుడ్ స్పెషల్ :

అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కంటెంట్ సిద్ధంగా ఉంది. హాలీవుడ్ చిత్రాలను ఇష్టపడేవారి కోసం కొన్ని సినిమాలను రెంట్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో పాటు హారర్ ఫ్రాంచైజీకి చెందిన ‘ఇన్సెడియస్: ఔట్ ఆఫ్ ద ఫర్దర్’ ఉన్నాయి.

ఇక ‘క్యారీ’ అనే ఇంగ్లీష్ సిరీస్, హిందీ రొమాంటిక్ డ్రామా ‘ఇష్కా ఇష్కా’ కూడా ఈ వారంలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మొత్తంగా అక్టోబర్ రెండో వారం ఓటీటీ ప్రేక్షకులకు సినిమాలు, సిరీస్‌లతో మంచి వినోదాన్ని అందించనుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you