Babu Mohan:తెలుగు బుల్లితరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో లలో “జబర్దస్త్” కూడా ఒకటి అని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పలువురు కళాకారులు సినీ పరిశ్రమలో అవకాశాలు అందుకున్నారు. తాజాగా ప్రసారం కానున్న ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల గాక అందులో కనిపించిన వినోదభరిత క్షణాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
బాబు మోహన్ ఎంట్రీ తో నవ్వుల సందడి:
ఈ ఎపిసోడ్ లో ప్రముఖ నటుడు బాబు మోహన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేసిన కామెడీ స్కిట్ మొత్తం ఎపిసోడ్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్కిట్ మధ్యలో డైలాగ్స్ గుర్తు చేసుకునేందుకు పలుమార్లు ప్రాంప్ట్ కోరడం ..మాటలు మరిచిపోవడం అక్కడున్న వారందరినీ కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా జడ్జీలు నాగబాబు, ఇంద్రజ ఆయన హావ భావాలకు నవ్వులు ఆపుకోలేకపోయారు. స్కిట్ అనంతరం బాబు మోహన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
also read:Pradeep rawat:సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ విలన్ మృతి!
నాగబాబు కామెంట్స్ వైరల్:
స్క్రిప్ట్ అనంతరం బాబు మోహన్(Babu Mohan) మాట్లాడుతూ..” నా 41 ఏళ్ల సినీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన నాగబాబు..” మీరు ఇలా ప్రాంప్ట్ అడుగుతూ నటించడం వల్ల ఇంకా ఎక్కువగా నవ్వొచ్చింది. రెగ్యులర్ గా నటించి ఉంటే ఈ స్థాయిలో ఎంజాయ్ చేసేవాళ్లం కాదేమో” అంటూ చమత్కరించారు. చివరిగా బాబు మోహన్ తన ప్రత్యేకమైన “ఎందుకు.. ఏమిటి.. ఎలా..?” అనే డైలాగ్ చెప్పడంతో మరోసారి నవ్వుల వర్షం కురిసింది.
also read:Fauzi:ఫౌజీ సినిమాకి ట్రైలర్ ఉండదా?
ప్రత్యేక ఆకర్షణగా కిరిటీ దామరాజు:
ఈ ఎపిసోడ్లో నటుడు కిరీటి దామరాజు కూడా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం హైలైట్ గా మారింది. అలాగే శ్రీనివాస మంగాపురం టీం పాల్గొని కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. మరోవైపు రాకింగ్ రాకేష్ టీమ్ చేసిన కామెడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించింది. రాంప్రసాద్ అండ్ టీం వేసిన వరుస పంచులకు జడ్జి ఇంద్రజ నవ్వు ఆపుకోలేక ..”అరేయ్ .. కాస్త గ్యాప్ ఇవ్వండి రా..!” అంటూ సరదాగా స్పందించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రేక్షకులు పూర్తి ఎపిసోడ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు..!!




