Nidhhi Agerwal:టాలీవుడ్ ,కోలీవుడ్ పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును పొందింది హీరోయిన్ నిధి అగర్వాల్. అంతేకాకుండా పలు రకాల యాడ్స్, ప్రమోషన్స్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. నిధి అగర్వాల్ ఎన్నో చిత్రాలలో నటించినా.. స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ ఫారమ్ లను ప్రచారం చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ కు గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ రోజున ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.
ఈడీ అధికారుల ముందు నిధి అగర్వాల్..
బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఆమె స్టేట్మెంట్ ను ఈడి అధికారులు రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రచారంలో సినీ సెలెబ్రేటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన ఈడి దర్యాప్తు కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఆయా ప్లాట్ ఫామ్ లను ప్రచారం చేసినందుకుగాను సెలబ్రెటీలకు జరిగిన చెల్లింపులు, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, మనీ లాండరింగ్ కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం మీద 29 మంది సెలబ్రెటీలు, సోషల్ మీడియా ప్రముఖుల పైన ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
also read:TV:బుధవారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానల్‌లో ఏ సినిమా అంటే?
అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకే..
మియాపూర్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తెలంగాణ పోలీసులు సైతం ఈ కేసుని నమోదు చేశారు. సెలబ్రిటీల ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారని, వాటి ద్వారా ప్రజలను డబ్బులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు అంటూ ఫిర్యాదుల ఆరోపణలు చేశారు. ఈ కేసులో హీరో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ, నిధి అగర్వాల్(Nidhhi Agerwal) తో పాటుగా మరి కొంతమంది సినీ సెలబ్రిటీలు , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ల పేరు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. కానీ ఇందులో చాలామంది సెలబ్రిటీలు తాము చట్టబద్ధమైన ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ ఫామ్ లను మాత్రమే ప్రచారం చేసామని తెలిపారు.
also read:Mokshagna:నాలుగేళ్ల సస్పెన్స్‌కు తెర..మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్..!?
నిధి అగర్వాల్ స్పందిస్తుందా?
తాము ఎలాంటి అక్రమ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదంటూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ అధికారుల ముందు ఎలాంటి వివరాలు ఇవ్వబోతోంది? అధికారులు ఎలాంటి విషయాలు రాబడతారు? అనే విషయంపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నిధి అగర్వాల్ కు జరిగిన చెల్లింపులు ప్రచార ఒప్పందాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు విచారణలో కీలకంగా ఉండనున్నాయట. మరి ఈ విషయం పైన హీరోయిన్ నిధి అగర్వాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




