Saturday, November 14, 2026
HomeINTERVIEWSHarshavardhan:అమృతం సీరియల్ నటుడి లవ్ స్టోరీలో ఇంత విషాదమా?

Harshavardhan:అమృతం సీరియల్ నటుడి లవ్ స్టోరీలో ఇంత విషాదమా?

Harshavardhan:కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు హర్షవర్ధన్ తెలిపారు. దాదాపు ఏడేళ్లపాటు తమ మధ్య ప్రేమ కొనసాగిందని, అయితే ఒకరికొకరు ఎప్పుడూ నేరుగా ‘ఐ లవ్ యూ’ చెప్పుకోలేదని గుర్తుచేసుకున్నారు

on
- Advertisement -banner Ad

Harshavardhan:సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షవర్ధన్. ముఖ్యంగా ‘అమృతం’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల ‘కోర్ట్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. అయితే 50 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన ప్రేమ వైఫల్యం, పెళ్లిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఏడేళ్ల ప్రేమ.. అనుకోని బ్రేకప్:

కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు హర్షవర్ధన్ తెలిపారు. దాదాపు ఏడేళ్లపాటు తమ మధ్య ప్రేమ కొనసాగిందని, అయితే ఒకరికొకరు ఎప్పుడూ నేరుగా ‘ఐ లవ్ యూ’ చెప్పుకోలేదని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, పెళ్లి చేసుకుని పిల్లలను కనకుండా అనాథాశ్రమాల నుంచి ముగ్గురు లేదా నలుగురు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకోవాలని కూడా అప్పట్లో అనుకున్నారట. ఆమె ఆలోచనలు చూసి తనకు ఎంతో ఆశ్చర్యం కలిగిందని, ఇంతకంటే మంచి జీవిత భాగస్వామి మరొకరు దొరకరేమోనని భావించానని చెప్పారు.

- Advertisement -
Advertisement

కానీ అనూహ్యంగా ఓ రోజు ఆమె తనకు చెప్పకుండానే దూరమై, మరొకరిని పెళ్లి చేసుకుందని వెల్లడించారు. తాను ఓ అవార్డు కార్యక్రమంలో స్టేజ్‌పై ఉన్న సమయంలో ఆమెకు పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందట. అంతకుముందు రెండు నెలలుగా ఆమె నుంచి ఫోన్ కూడా రాలేదని, తాను సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు.

also read:Actress Sitara:ఆ ఒక్క సంఘటనే.. సితార జీవితం తలకిందులు..!

- Advertisement -
Advertisement

బ్రేకప్ బాధ నుంచి త్వరగానే బయటపడ్డా:

ఆమె తనను వదిలి వెళ్లిన సమయంలో చాలా బాధపడ్డానని హర్షవర్ధన్ చెప్పారు. రెండు మూడు రోజులపాటు మద్యం సేవిస్తూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేశానని, ఆ తర్వాత తనకు తానే సర్దిచెప్పుకున్నానని తెలిపారు. ఆమె వెళ్లిపోవడం వల్లే తనకు మంచి జీవితం లభించిందేమోనని ఇప్పుడు భావిస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే తనకు సినిమాల్లోకి రావడం ఆమెకు ఇష్టం లేదని, ఈ సంఘటన జరగకపోతే తన జీవిత ప్రయాణం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు.

తాజాగా తన జీవితంలో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను నటుడు హర్షవర్ధన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓ టాప్ మోస్ట్ తెలుగు కమెడియన్ తనను పెళ్లి గురించి ప్రశ్నించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు నచ్చిన సినిమాలో నటించాలనే కోరికతో ఓ సీన్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

- Advertisement -
Advertisement

ఆ సమయంలో సదరు కమెడియన్ తన దగ్గరకు వచ్చి.. ‘‘ఏమయ్యా హర్షవర్ధన్(Harshavardhan).. ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’’ అని అడిగారట. అందుకు తాను కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని వివరిస్తూ.. ‘‘నా జీవితం, నా బిజీ వేరు. మరొకరికి సమయం కేటాయించే పరిస్థితిలో నేను లేను’’ అని సమాధానం చెప్పినట్లు హర్షవర్ధన్ వెల్లడించారు.

also read:Simran Choudhary: కైపెక్కించే ఫోజులతో మెస్మరైజ్ చేసిన సిమ్రాన్ చౌదరి!

ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? :

అయితే ఆ కమెడియన్ అక్కడితో ఆగకుండా తన గత అనుభవాన్ని కూడా ప్రస్తావించారట. గతంలో తన దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్‌ను కూడా ఇలాగే పెళ్లి గురించి అడిగానని, అతను కూడా హర్షవర్ధన్ తరహాలోనే సమాధానం చెప్పాడని నవ్వుతూ వ్యాఖ్యానించారట. అంతేకాకుండా, ‘‘ఏమైనా ప్రాబ్లమ్ ఉందా?’’ అంటూ వెటకారంగా ప్రశ్నించినట్లు హర్షవర్ధన్ గుర్తు చేసుకున్నారు.

దీనికి తాను కూడా సరదాగానే కౌంటర్ ఇచ్చానని చెప్పారు. ‘‘నేను ఆ పరిస్థితిలో ఉండి ఉంటే.. మీ భార్యను, మీ అక్కను, మీ కూతురిని ఒకసారి నా దగ్గరకు పంపించండి. నేను ఎలాంటి వాడినో వాళ్లనే అడిగి సర్టిఫికెట్ తీసుకోండి అని చెప్పేవాడిని’’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చేవాడినని నవ్వుతూ తెలిపారు.

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఇతరులను ఇబ్బందిపెట్టేలా ప్రశ్నలు అడగడం సరైన పద్ధతి కాదని ఈ సంఘటన ద్వారా హర్షవర్ధన్ చెప్పకనే చెప్పారు. వయసు పెరిగినంత మాత్రాన సరిపోదని, ఎదుటివారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించే ఇంగితజ్ఞానం కూడా ఉండాలని ఆయన వ్యాఖ్యల సారాంశం. ప్రస్తుతం హర్షవర్ధన్ చెప్పిన ఈ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you