Saturday, November 14, 2026
HomeLATESTSai Pallavi:ఓం సినిమాలో సాయి పల్లవి పాత్ర వెనుక ఇంత కథ ఉందా..?

Sai Pallavi:ఓం సినిమాలో సాయి పల్లవి పాత్ర వెనుక ఇంత కథ ఉందా..?

Sai Pallavi: ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం సినిమాలో సాయి పల్లవి పాత్ర వెనుక ఉన్న స్టోరీని డైరెక్టర్ పెరియ స్వామి వెల్లడించారు.

on
- Advertisement -banner Ad

Sai Pallavi:ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించగలిగే హీరోయిన్లలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు ఎక్కువ సినిమాలలో ఈమెకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాలీవుడ్ రామాయణ సినిమాలో కూడా సీత పాత్రలో అద్భుతంగా నటించింది. ఈమె నటన పైన కూడా ప్రశంసలు వినిపించాయి. ఇప్పుడు ధనుష్ నటించిన ఓం సినిమాలో ఈమె నందిని ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు.

ఓం సినిమాలో సాయి పల్లవి పాత్ర ఆమెను ఉద్దేశించేనా?

ఇటీవల సాయి పల్లవి(Sai Pallavi) ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే సాయి పల్లవి పోషించిన పోలీసు అధికారి పాత్రకు కేరళకు చెందిన పోలీస్ అధికారి మెరిన్ జోసెఫ్ స్ఫూర్తి గా తీసుకొని డైరెక్టర్ ఆ పాత్రను తెరకెక్కించారని వెల్లడించారు. అయితే ఈ పాత్రలో నటించే ముందు సాయి పల్లవి స్వయంగా మేరిన్ ను కలిసామని.. పోలీస్ అధికారి ఎలా ఉంటారు? ఎలా వ్యవహరిస్తారు. అనే విషయాలపై ఆమె దగ్గర నుంచి పలు సూచనలు తీసుకున్నట్లు తెలియజేశారు. పాత్రలో కూడా సాయి పల్లవి అద్భుతంగా నటించారని , ఓం సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుందంటూ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

పాత్ర వెనుక సాయి పల్లవి కష్టం..

ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ ఓం చిత్రంలో శ్రీ లీల మరొక హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 8 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. ఓం చాప్టర్ 1 ఉదిరం-ది బ్లడ్ వుడ్ అనే టైటిల్ తో ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రం అడవి నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామా, అలాగే ఎర్రచందనం గురించి కూడా ఉండబోతున్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ లో కూడా చూపించారు.

also read:Telugu Movies:ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 సినిమాలు ఇవే..!

- Advertisement -
Advertisement

అద్భుతమైన పాత్రలో అదరగొట్టేయనున్న సాయి పల్లవి..

సాయి పల్లవి పాత్ర పేరు నిత్య రెడ్డి.. ఇందులో ఆమె ఐపీఎస్ అధికారిగా నటించనుంది. రాష్ట్ర పోలీస్ శాఖలో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత సిబిఐ లో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తుంది. అక్కడ ఆపరేషన్ ఓం కీలక దర్యాప్తుకు న్యాయకత్వం వ్యవహరిస్తుంది. ఈ దర్యాప్తు ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించినదిగా తెలుస్తోంది.. ఇటీవలే చిత్ర బృందం కూడా సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. సాయి పల్లవి పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన మేరీన్ జోసెఫ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి.. ఈమె సివిల్ పరీక్షలలో 188వ ర్యాంకు సాధించింది. 2019లో పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఈమె పేరు బాగా వినిపించింది..

also read:Harshavardhan:అమృతం సీరియల్ నటుడి లవ్ స్టోరీలో ఇంత విషాదమా?

- Advertisement -
Advertisement

నవంబర్ 20న విడుదల..

డైరెక్టర్ పెరియా స్వామి దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తూ ఉండడం ఇది రెండవ సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అమరన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో డైరెక్టర్ రాజ్ కుమార్ కు ఉత్తమ దర్శకుడిగా కూడా జాతీయ అవార్డు అందుకున్నారు. మరి ఓం సినిమా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you