Suriya:సినిమా విజయం సాధించాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోల పారితోషికాలు, గ్రాండ్ విజువల్స్ తప్పనిసరి కాదని మరోసారి నిరూపించారు హీరో సూర్య, దర్శకుడు జీతూ మాధవన్. కంటెంట్‌పై నమ్మకం, బడ్జెట్‌పై నియంత్రణ ఉంటే తక్కువ ఖర్చుతోనూ భారీ విజయాన్ని అందుకోవచ్చని వీరి కాంబినేషన్ చాటిచెప్పింది. ముఖ్యంగా “సీన్” సినిమా బడ్జెట్, సూర్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి.
రూ.30 కోట్ల లోపే సినిమా బడ్జెట్:
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయంటే నిర్మాతలు భారీ బడ్జెట్‌ను కేటాయిస్తుంటారు. హీరోల మార్కెట్, దర్శకుడి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఖర్చు విషయంలో వెనుకాడరు. అయితే సీన్ సినిమా విషయంలో మాత్రం దర్శకుడు జీతూ మాధవన్ భిన్నమైన ఆలోచనతో ముందుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కథను రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాల్సిన అవసరం లేదని భావించి, మొదటి నుంచే పరిమిత వ్యయంతో సినిమాను రూపొందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ రూ.30 కోట్ల లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట.
రూ.45 కోట్ల రెమ్యునరేషన్ నుంచి రూ.15 కోట్లకు:
ఈ సినిమాలో సూర్య తీసుకున్న నిర్ణయం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. ‘కరుప్పు’ సినిమా హిట్ తర్వాత ఆయన రెమ్యునరేషన్ సుమారు రూ.45 కోట్లకు చేరిందనే ప్రచారం ఉంది. అలాంటి సమయంలో సీన్ సినిమా కోసం సూర్య కేవలం రూ.15 కోట్ల పారితోషికానికే అంగీకరించారు. అంటే తన మార్కెట్, స్టార్‌డమ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా కథకు, దర్శకుడి ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
also read:Idupukayitham:ఇడుపు కాయితం.. టీజర్ రిలీజ్..!
దర్శకుడి విజన్‌ను నమ్మిన సూర్య :
సూర్య(Suriya)లాంటి టాప్ లీగ్ హీరో ఒక సినిమా కోసం తన పారితోషికాన్ని తగ్గించుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. కథకు ఎంత బడ్జెట్ అవసరమో అంతే ఖర్చు చేయాలనే ఆలోచనకు ఆయన మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ‘నా రేంజ్ ఎంత? నా మార్కెట్ ఎంత?’ అనే లెక్కల కంటే సినిమా విజయం సాధించాలనే లక్ష్యానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఒక స్టార్ హీరోగా కాకుండా కథలో భాగస్వామిగా ఆలోచించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
also read:Samantha:సమంత జీవితంపై మరో రూమర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!
జీతూ మాధవన్ నుంచి నిర్మాతలకు మంచి సందేశం :
మరోవైపు జీతూ మాధవన్ ఇప్పటికే రెండు విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్య లాంటి స్టార్ హీరో, జ్యోతిక లాంటి నిర్మాత అండగా ఉన్నప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయడానికి కూడా అవకాశముంది. అయినప్పటికీ కథకు అవసరమైన మేరకే ఖర్చు చేయాలని నిర్ణయించుకోవడం ఆయన ప్రణాళికాబద్ధమైన పనితీరుకు నిదర్శనం.
మొత్తానికి స్టార్ హీరోల పారితోషికాలు, భారీ సెట్లు, అనవసరమైన ఖర్చులే సినిమా విజయానికి కొలమానం కాదని ఈ సినిమా చర్చ తెలియజేస్తోంది. కథపై స్పష్టత, దర్శకుడి విజన్‌పై నమ్మకం, నిర్మాణంలో క్రమశిక్షణ ఉంటే పరిమిత బడ్జెట్తోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చనే సందేశాన్ని సూర్య, జీతూ మాధవన్ ఇచ్చినట్లయింది.




