Saturday, November 14, 2026
HomeLATESTManchu Manoj:వ్యాపార రంగంలోకి మంచు మనోజ్ దంపతులు..!

Manchu Manoj:వ్యాపార రంగంలోకి మంచు మనోజ్ దంపతులు..!

Manchu Manoj: మంచు మనోజ్ దంపతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయుపై సంతకం చేశారు.

on
- Advertisement -banner Ad

Manchu Manoj:టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించగలిగే హీరోలలో మంచు మనోజ్ కూడా ఒకరు. రెండవ వివాహము అనంతరం ఎక్కువగా మనోజ్ పేరు వైరల్ గా మారుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వెండితెర పైన విభిన్నమైన యాక్షన్ తో ఆకట్టుకున్న మంచు మనోజ్ ఇప్పుడు తాజాగా పారిశ్రామికవేత్తగా అడుగులు వేయబోతున్నట్లు వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడులను ఆకర్షించే దిశగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 31 వ సిఐఐ భాగస్వామి సదస్సు వేదికగా నిలిచింది.

వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మనోజ్ దంపతులు..

ఈ వేదికలో మంచు మనోజ్(Manchu Manoj) దంపతులు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రగతిని పరుగులు పెట్టడం , స్థానిక యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం దేశ విదేశీ పారిశ్రామికవేత్తలతో సిఐఐ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ , ఆయన భార్య భూమా మౌనిక ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామిక ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఎంఓయూ పత్రాలపైన సంతకాలు చేశారు. ఒక నటుడుగా తాను రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Allu Sneha Reddy:అల్లు అర్జున్ భార్యకు అరుదైన గౌరవం..?

ఉపాధి కల్పించడమే లక్ష్యం..

కానీ మంచు మనోజ్ దంపతులు ఏ రంగానికి చెందిన పారిశ్రమను స్థాపించబోతున్నారు? ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు? అనే విషయం పైన మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సానుకూల వాతావరణం వల్లే మనోజ్ దంపతులు సైతం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు సైతం ఈ జంటపైన ప్రశంసలు కురిపిస్తూ వైరల్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:క్యాన్సర్ ను జయించిన టాలీవుడ్ హీరోయిన్..!

మంచు మనోజ్ సినిమా కెరియర్..

మంచు మనోజ్ సినిమాలలో హీరోగా విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధమయ్యారు మనోజ్. సామాజిక సమస్యల పైన నిరంతరం మంచు మనోజ్ స్పందిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వ్యాపార పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నటుడుగా ఎన్నో విజయాలను అందుకున్న మంచు మనోజ్ పారిశ్రామికవేత్తగా కూడా సక్సెస్ కావాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. మంచు మనోజ్ సినీ కెరియర్ విషయానికి వస్తే 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్ గా నటించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించిన మంచు మనోజ్ దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, మిస్టర్ నూకయ్య తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. 2025లో భైరవం అనే సినిమాలో కూడా నటించారు అలాగే మిరాయ్ అనే సినిమాలో కూడా విలన్ గా నటించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you