Wednesday, November 11, 2026
HomeLATESTKavya Maran:గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి సందడి.. కావ్యతో రొమాంటిక్ వీడియో వైరల్!

Kavya Maran:గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి సందడి.. కావ్యతో రొమాంటిక్ వీడియో వైరల్!

Kavya Maran:వివాహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో అనిరుధ్, కావ్య ఎంతో సంతోషంగా, ఒకరితో ఒకరు ఆప్యాయంగా కనిపిస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Kavya Maran:ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహం ప్రస్తుతం సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా.. తాజాగా వివాహ వేడుకకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అనిరుధ్, కావ్య ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ జంట ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య వివాహ వేడుక :

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ వేడుకలు గ్రీస్‌లో ఘనంగా జరుగుతుంది. నవంబర్ 10, 11 తేదీల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చెన్నై నుంచి గ్రీస్‌కు బయలుదేరారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబం కూడా ఈ వేడుకలకు హాజరవ్వడం హైలెట్ గా మారింది. దీంతో ఈ వివాహ వేడుకలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
Advertisement

also read:Vaishnavi Chaitanya: కిర్రాక్ ఫోజులతో కైపెక్కిస్తున్న వైష్ణవి చైతన్య..

వైరల్‌గా మారిన పెళ్లి వీడియో :

తాజాగా ఈ వివాహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో అనిరుధ్, కావ్య ఎంతో సంతోషంగా, ఒకరితో ఒకరు ఆప్యాయంగా కనిపిస్తున్నారు. వారి మధ్య ఉన్న అనుబంధం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జంట కెమెరా ముందు కనిపించిన తీరు, వారి చిరునవ్వులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Nayanthara:నయనతార స్టార్ డమ్ పై గట్టి దెబ్బ పడిందా..?

దుస్తుల్లోనూ ప్రత్యేక ఆకర్షణ:

ఈ వివాహ వేడుకల్లో అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్(Kavya Maran) ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంప్రదాయానికి ఆధునికతను జోడించిన తమ స్టైలిష్ లుక్స్‌తో ఈ జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి మంచి స్పందనను అందుకుంటున్నాయి. ఇప్పటివరకు తన అద్భుతమైన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన అనిరుధ్.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లి వార్తలతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా గుర్తింపు పొందిన కావ్య మారన్ సైతం తన అందం, ఫ్యాషన్ సెన్స్, ఆకట్టుకునే లుక్‌తో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఈ జంటకు సంబంధించిన ప్రతి ఫొటో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

- Advertisement -
Advertisement

నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ :

గ్రీస్‌లో వివాహ వేడుకలు ముగిసిన తర్వాత నవంబర్ 21న చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అనిరుధ్ – కావ్య పెళ్లి వైరల్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you