Wednesday, November 11, 2026
HomeLATESTTarun Bhaskar:పెళ్లిపై.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్..!

Tarun Bhaskar:పెళ్లిపై.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్..!

Tarun Bhaskar: ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Tarun Bhaskar:పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో నటుడుగా డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది రిపీట్ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. నవంబర్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ ని స్పీడ్ పెంచారు. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి విషయం పైన పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు తరుణ్ భాస్కర్.

పెళ్లిచూపులు సీక్వెల్ తీసే ప్రసక్తి లేదు..

ఈ నగరానికి ఏమైంది 2 చిత్రం మాదిరే పెళ్లిచూపులు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారా అని యాంకర్ ప్రశ్నించగా? నాకు ఆ సీక్వెల్ వద్దు. ఈ సినిమాకి వచ్చిన టెన్షన్ ని నేనే తట్టుకోలేకపోయాను. రిజల్ట్ బాగుండాలని కోరుకుంటున్నాను. అంచనాలు లేకుండా పనిచేయడంలోనే ఒక హాయి ఉంటుంది. నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలినే ఉంది. ఈ టెన్షన్ వల్ల నా లైఫ్ మొత్తం పోయేలా ఉందంటూ తెలియజేశారు.. పెళ్లి, పెళ్లి చూపుల గురించి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. నా ఉద్దేశంలో ఏ మనిషికైనా సహనం అనేది ఉండాలి, ఇప్పుడు ఉన్న జెన్ జి వాళ్ళు పెళ్లి కాన్సెప్ట్ ని సిచువేషన్ అని ఏదో అంటున్నారు.. పెళ్లి అనేది మనం నిర్మించుకున్నది ఎవరైనా కలిసి బతుకుదాం అనుకుంటే వారిని అలాగే ఉండనివ్వండి.. వాళ్లు సంతోషంగా ఉంటారు ఎవడి చావు వాడు చస్తారు అంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

నాకు ఇంకొన్నాళ్ళు బ్రతకాలని ఉంది..

ఇప్పుడు చాలా కుటుంబాలలో పెళ్లి చేసుకున్న వారు మాట్లాడుకోకుండానే వివాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇష్టం లేకపోయినా కలిసి జీవిస్తున్నారు. చాలా అవస్థలు పడుతున్నారు. జీవితాంతం భరించాలి విడాకులు తీసుకోకుండా ఉండాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. అలాంటి వాటికి విలువ ఉండదు. అంతా టైం వేస్ట్ అంటూ తెలిపారు తరుణ్ భాస్కర్(Tarun Bhaskar). నేను కలిసి బతకలేనేమో అని బయట సమాజంలో చెప్పుకోవడానికి మనిషి చాలా నామోషగా ఫీల్ అవుతున్నారని తెలియజేశారు. పరస్పర గౌరవంతో విడిపోయి వేరే భాగస్వామిని వెతుక్కుని వివాహం చేసుకుంటే ఏమవుతుందో అనే ఒక భయం ఉందని తెలిపారు.

also read:Kavya Maran:గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి సందడి.. కావ్యతో రొమాంటిక్ వీడియో వైరల్!

- Advertisement -
Advertisement

పెళ్లిపై అభిప్రాయం చెప్పిన తరుణ్ భాస్కర్..

నాకైతే కచ్చితంగా ఈ అంశం మీద సినిమా తీయాలని ఉంది కాకపోతే పెళ్లిచూపులు మాదిరిగా రొమాంటిక్ కామెడీ కాకుండా ఒక డ్రామాగా సినిమా తీయాలి. నాకు పెళ్లి పైన విరక్తి రాలేదు మారే పరిస్థితిలను బట్టి కథలను కూడా మారుస్తూ ఉండాలి అంటూ తరుణ్ భాస్కర్ తెలియజేశారు. తరుణ్ భాస్కర్ సినిమాలలోనే కాకుండా పెళ్లి విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక ఏజ్ దాటిన తర్వాత ఏ రిలేషన్ అయినా సరే వివిధ దశలలో వేరు వేరు విషయాలకు అట్రాక్ట్ అవుతూ ఉంటాం మనము అని తెలిపారు.

also read:Vaishnavi Chaitanya: కిర్రాక్ ఫోజులతో కైపెక్కిస్తున్న వైష్ణవి చైతన్య..

- Advertisement -
Advertisement

రూమర్స్ ను నిజం చేస్తారా..

30 నుంచి 40 ఏళ్ల వయసులో మానసిక ప్రశాంతత అవసరం ఎక్కడ దొరుకుతుందో అది వెతుక్కోవాలి. వంద మంది ఉండడం కంటే మనకు మనశ్శాంతి ఇచ్చేవారు ఒకరు ఉంటే చాలు.. మనశ్శాంతి అనేది చాలా విలువైనది అంటూ సింగీతం శ్రీనివాసరావు గారు నాకు చెప్పేవారని తెలిపారు. ప్రస్తుతమైతే తాను మనశ్శాంతిగా ఉన్నానని తరుణ్ భాస్కర్ వెల్లడించారు. 2013లో లతా నాయుడుని వివాహం చేసుకున్న తరుణ్ భాస్కర్ కొన్నేళ్ళకు విడిపోయారు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోయిన్ ఈషా రెబ్బాతో రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ వీరిద్దరూ పలు సందర్భాలలో కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ మరింత వైరల్ గా మారుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you