Bigg Boss:బిగ్ బాస్ షోను తిట్టుకునే జనాలు ఎంతమంది ఉన్నా.. అంతకంటే డబుల్ స్థాయిలోనే బిగ్ బాస్‌ను లైక్ చేసే జనాలు ఇంకా ఎక్కువగా ఉంటారు. బిగ్ బాస్ (Bigg Boss)పలు సీజన్లను కంప్లీట్ చేసుకున్నా.. ఇంకా కొత్త సీజన్స్ రావాలని ప్రేక్షకులు ఆశపడుతూనే ఉంటారు. రీసెంట్‌గానే తెలుగులో బిగ్ బాస్ 10వ సీజన్ ప్రారంభమై మంచి ఆదరణతో కొనసాగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ బిగ్ బాస్ సందడి చేస్తోంది.
తమిళ్ బిగ్ బాస్‌లో ఊహించని పరిణామం :
అయితే బిగ్ బాస్ తమిళం 10వ సీజన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. షో ప్రారంభమైన కేవలం రెండు రోజులకే ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది .
ALSO READ:TV:గురువారం టీవీలలో ఈ సినిమాలు మిస్ కావొద్దు!
20 అడుగుల గోడ ఎక్కిన కంటెస్టెంట్ :
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ్ బిగ్ బాస్ 10వ సీజన్ సెప్టెంబర్ 6న 19 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఇందులో ‘కుక్ విత్ కోమలి’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆన్సర్ కూడా వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టాడు.
ఏమైందో ఏమో తెలియదుగానీ.. బిగ్ బాస్ ప్రయాణం మొదలైన రెండో రోజే ఆన్సర్ ఏకంగా 20 అడుగుల గోడపైకి ఎక్కి హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్‌గా మారింది.
ALSO READ:Maremma Movie Review: రవితేజ తమ్ముడి కొడుకు డెబ్యూ ఎలా ఉందంటే..?
అసలు ఎందుకు పారిపోవాలనుకున్నాడు? :
ఆన్సర్ హఠాత్తుగా వచ్చి పారిపోవడానికి ప్రయత్నించడానికి గల కారణం ఇదే అని అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా.. జనాలు మాత్రం సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
తోటి కంటెస్టెంట్ జేసన్ తో జరిగిన తీవ్ర వాగ్వాదం, అదేవిధంగా కెప్టెన్సీ చర్చల సమయంలో జరిగిన ఏదైనా ఘర్షణలే ఆయనకు బిగ్ బాస్ అంటే విరక్తి తెప్పించాయని కొంతమంది అంటున్నారు. బిగ్ బాస్‌లో ఉండడం వేస్ట్ అని భావించి గోడ దూకి బయటకు వెళ్లాలనుకున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఒత్తిడి వల్లే ఇలా చేశాడా? :
గొడవల వల్ల ఒత్తిడికి గురై, తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన ఆన్సర్.. అందుకే మనస్తాపంతో హౌస్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినట్టున్నాడని మరికొందరు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
అసలు ఆన్సర్ ఎందుకు బయటకు రావాలనుకున్నాడు? ఇది నిజంగా జరిగిందా? లేకపోతే ఏదైనా టాస్క్‌లో భాగంగా చేసిన స్టంటా? అనే విషయాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Someone’s dislike of #Ansar has reached a whole new AI level… 😂
Bro hasn’t even left the house…
but apparently, the audience has already arranged his exit! 🤣🔥#BiggBossTamil10 #BiggBossTamil#BiggBossTamilSeason10 pic.twitter.com/MyFv0MiomH— Back Bench Reviewer (@BackBenchReview) September 8, 2026




