Tuesday, October 6, 2026
HomeLATESTVijay Deverakonda:రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కావడానికి కారణం అదేనా..?

Vijay Deverakonda:రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కావడానికి కారణం అదేనా..?

Vijay Deverakonda: ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ రణబాలి సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మికపై కామెంట్లు చేశారు.

on
- Advertisement -banner Ad

Vijay Deverakonda:టాలీవుడ్ లో పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ, రష్మిక జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. అయితే వివాహం కాకముందు వరకు ఈ జంట లవ్ స్టోరీ పైన పలు రకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా స్క్రీన్ మీద కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్ రియల్ లైఫ్ లో కూడా ఈ జంట ఒకటైతే బాగుంటుందని చాలా సందర్భాలలో కోరుకున్నారు. వివాహమనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రణబాలి సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమ ఎనిమిదేళ్ల రిలేషన్స్ పైన విజయ్ దేవరకొండ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రేమ పెళ్లి పై తొలిసారి స్పందించిన విజయ్..

2018లో వచ్చిన గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) రష్మిక మొదటిసారి కలిసి నటించారు. ఆ తర్వాత 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రంతో మరొకసారి ఈ జంట పాపులర్ అయింది. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ వార్తలు వినిపించాయి. మొదటి సినిమా నుంచి వీరి మధ్య స్నేహం ఉండడంతో ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారిందని విజయ్ తాజాగా తెలియజేశారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తమ రిలేషన్ గురించి మాట్లాడుతూ.. పర్సనల్ లైఫ్ గురించి పబ్లిక్ గా మాట్లాడుకోవడం తనకి ఎక్కువగా ఇష్టం ఉండదు అంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss 10:అపూర్వ, ముఖేష్ మధ్య పర్సనల్ వార్.. బిగ్ బాస్ హౌస్‌లో హైడ్రామా!

రష్మికను పెళ్లి చేసుకోవడానికి అదే కారణం..

తమ రిలేషన్ గురించి ఇప్పుడు కూడా దాగుడుమూతలు ఆడాలని అనుకోలేదు, తమ వ్యక్తిగత విషయాలను అందరి ముందు చర్చించాల్సిన అవసరం లేదనే ఆలోచనతోనే తాము ఉండేవాళ్ళని తెలిపారు .ఇక రష్మికనీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారంటూ విజయ్ ని ప్రశ్నించగా.. జీవితంలో జరిగే చిన్న చిన్న సందర్భాలలో తనకు రష్మిక లేని లోటు వెంటాడడం మొదలయ్యిందని, అప్పుడే తన జీవితంలో రష్మిక చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించాను అంటూ తెలిపారు. రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఒకే ఫిట్నెస్ ట్రైన్ దగ్గర వర్క్ చేసేవారు.

- Advertisement -
Advertisement

also read:Rajinikanth:జైలర్ 2 ట్రైలర్ లో మాస్ డైలాగులతో ఆకట్టుకుంటున్న రజనీకాంత్..!

ఆమె లేని లోటు బాగా తెలిసి వచ్చింది..

అలా అక్కడ కూడా కలిసి టైం స్పెండ్ చేయడం ,భోజనం చేయడం వంటివి చేసే వారిని కొన్ని సందర్భాలలో తాను ఒంటరిగా కూడా భోజనం చేస్తున్నప్పుడు రష్మిక తన పక్కన ఉంటే బాగుండేదేమో అనిపించింది .అలా చిన్న చిన్న క్షణాలే తన మనసులో పెద్ద మార్పులు తీసుకువచ్చాయి అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. రష్మిక తన జీవితంలోకి వచ్చాక ఈ ప్రపంచం మొత్తం అందంగా మారిపోయిందని తెలిపారు.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న రణబాలి చిత్రం దసరాకి విడుదల చేయబోతున్నారు.. మరి రియల్ లైఫ్ కపుల్ రీల్ లైఫ్ లో మళ్ళీ మ్యాజిక్ చేస్తారా లేదా అనే విషయం ఇప్పుడు అభిమానులలో మరింత ఆసక్తి పెంచేస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you