Varshini:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకీ కొత్త మలుపులు, ఆసక్తికరమైన సంఘటనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీలు, మనస్పర్థలు, గొడవలు ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు కొందరి ప్రవర్తన చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా నిర్వహించిన ‘స్టెప్ రోల్ గోల్’ టాస్క్‌లో కంటెస్టెంట్లు పోటాపోటీగా పాల్గొనగా, అపూర్వ, షాలిని మధ్య జరిగిన వాగ్వాదం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు హౌస్మేట్స్ స్విమ్మింగ్ పూల్‌లో చేసిన సందడి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కారణమైంది.
స్టెప్ రోల్ గోల్ టాస్క్‌లో అమన్‌కు మొదటి స్థానం :
బిగ్‌బాస్ ఐదు జంటలకు ‘స్టెప్ రోల్ గోల్’ టాస్క్‌ను అప్పగించారు. ఈ గేమ్‌లో నిర్ణీత క్రమంలో టాస్క్‌ను పూర్తి చేసిన జంటలకు పాయింట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ పోటీకి వంశీ, దేబ్జానీ సంచాలకులుగా వ్యవహరించారు. కంటెస్టెంట్లు గెలుపే లక్ష్యంగా ఉత్సాహంగా ఆడారు. రాంప్రసాద్ తొలుత టాస్క్‌ను పూర్తి చేయగా, అపూర్వ మాత్రం గేమ్ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో సమస్య ఎదురైంది. ఈ క్రమంలో ఆమె నరేశ్‌తో వాగ్వాదానికి దిగింది.
టాస్క్ ముగిసిన తర్వాత ఫలితాల్లో అమన్ మొదటి స్థానంలో నిలిచి 100 పాయింట్లు సాధించాడు. రాంప్రసాద్‌కు రెండో స్థానం, 80 పాయింట్లు దక్కాయి. ముకేశ్ మూడో స్థానంలో నిలిచి 60 పాయింట్లు పొందాడు. షాలిని నాలుగో స్థానంతో 40 పాయింట్లు సాధించగా, అపూర్వ ఐదో స్థానంలో నిలిచి 20 పాయింట్లతో సరిపెట్టుకుంది.
also read:RK Roja:మహేశ్ బాబు మూవీతో మారిన రోజా ఆలోచన..వెరీ ఇంట్రెస్టింగ్..!
అపూర్వ, షాలిని మధ్య మాటల యుద్ధం :
గేమ్‌కు ముందు హౌస్‌లోని కొందరు కంటెస్టెంట్లు తమలో తాము మాట్లాడుకుంటున్న సమయంలో రోహిత్, షాలిని, రాంప్రసాద్, అమన్ ఒకచోట ఉన్నారు. ఆ సమయంలో అపూర్వ అక్కడికి రావడంతో, తాము మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఇవ్వాలని రోహిత్ కోరాడు. దీంతో అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ఈ విషయంపై అపూర్వతో రోహిత్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. తాను ఆమెను ఉద్దేశించి అలా అనలేదని వివరించగా, ఆ విషయం తనకు గుర్తు లేదని అపూర్వ చెప్పింది. అయితే మధ్యలో షాలిని జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. తాను అడగని విషయాన్ని ప్రస్తావిస్తూ తన గురించి చర్చించవద్దని అపూర్వ అసహనం వ్యక్తం చేసింది.
మరోవైపు త్రిగుణ్ అపూర్వకు సర్దిచెప్పినట్టే చెబుతూ, షాలినితో ఆమె గురించి మాట్లాడినట్లు కనిపించింది. షాలినికి అమన్ మద్దతుగా నిలుస్తున్నాడని భావించిన రోహిత్, అలా చేయవద్దని అమన్‌కు సూచించాడు. దీంతో హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య విభేదాలు మరింత చర్చకు వచ్చాయి.
also read:RanaBali Trailer:విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రిలీజ్..!
స్విమ్మింగ్ పూల్‌లో సందడి.. నెటిజన్ల సెటైర్లు :
ఇక వర్షిణి(Varshini), ముకేశ్ కలిసి స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టడంతో హౌస్‌లో మరో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్లు కూడా పూల్‌లోకి దిగి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. అయితే ఈ దృశ్యాలు కొందరు ప్రేక్షకులకు గేమ్ కంటే రొమాంటిక్ సన్నివేశాలను తలపించాయి.
దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు, సెటైర్లతో స్పందిస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చింది టాస్కులు ఆడటానికా? లేక రొమాన్స్ చేసుకోవడానికా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గేమ్స్, గొడవలతో పాటు ఇలాంటి సన్నివేశాలు కూడా సీజన్‌పై చర్చను పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
Orrey asaluu em jaruguthundi raa ee house la 😳
BiggBoss eh na idi
#BiggBossTelugu10 #Mukesh #Muva https://t.co/Gf5XsR1slg— DRAGON 🦚🐉 (@Flash_Man18) October 8, 2026




