Wednesday, September 16, 2026
HomeLATESTIbomma Ravi:ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్..!

Ibomma Ravi:ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్..!

Ibomma Ravi: హాయ్ బొమ్మ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించి తన బ్యాంకు ఖాతాలను అన్ ఫ్రీజ్ చేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు.

on
- Advertisement -banner Ad

Ibomma Ravi:ఐ బొమ్మ రవి గడిచిన కొద్ది నెలల క్రితం ఎక్కువగా వినిపించిన పేరు. విశాఖపట్నం కి చెందిన కుర్రాడు . అంతేకాకుండా ఉన్నత చదువుల కోసం హైదరాబాదుకి వచ్చి అనంతరం పైరసీ వ్యవహారంలో కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా సినిమాల పైరసీ లో చాలామంది పెద్దల హస్తం ఉందనే విధంగా కూడా వార్తలు వినిపించాయి. అయితే ఐ బొమ్మ రవి ప్రేమించి వివాహం చేసుకున్న భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ కి రావడంతో.. ఈ విషయం పసిగట్టిన పోలీసులు అరెస్టు చేశారు.

నిర్మాతలకు ఇండస్ట్రీకి భారీ నష్టం మిగిల్చిన ఐ బొమ్మ రవి..

సినిమా పైరసీ, ఆన్లైన్ బెట్టింగ్ ప్రచారానికి సంబంధించిన పలు అంశాలలో కూడా ఐ బొమ్మ రవి కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఐ బొమ్మ వెబ్ సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్ ను సైతం బెట్టింగ్ యాప్ లకు మళ్లించినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి రవి(Ibomma Ravi) పైన పలు సెక్షన్స్ పేరిట కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపుగా మూడు నెలల పాటు జైలులోనే ఉన్న రవి ఫిబ్రవరి 17 2026న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Prerana kambam:తల్లి కాబోతున్న బుల్లితెర నటి..!

కుటుంబ పోషణ కష్టంగా ఉంది.. కోర్ట్ ను ఆశ్రయించిన రవి..

అలా జైలు నుంచి విడుదలైన రవి చాలా రోజులపాటు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఐ బొమ్మ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో మరొకసారి తెరపైకి రవి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం తాను ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని, తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టంగా ఉందంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సైతం రవి బ్యాంకు ఖాతాని ఫ్రీజ్ చేశారు. దీంతో తన ఖాతాలో 3000 కోట్ల రూపాయలు అలాగే ఉండిపోయాయి. దీనివల్ల తన కుటుంబాన్ని పోషించడం కూడా ఇబ్బందిగా మారిందని తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Ravi Teja:రవితేజకి షాక్ ఇచ్చిన సమంత.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!

అన్ ఫ్రీజ్ చేయాలంటూ విజ్ఞప్తి..

దీంతో తన బ్యాంకు ఖాతాను తనకు తిరిగి ఇప్పించాలని , తన పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పైన ఈరోజు నాంపల్లి కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్టేషన్ కోర్టు విచారణ చేపట్టనున్నారు. గతంలో ఐ బొమ్మ రవిని అరెస్టు చేసిన సందర్భంలో చాలామంది ఐ బొమ్మ రవికి మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయం పైన మాత్రం చాలామంది నిర్మాతలు పలు రకాల వివాదాస్పదమైన కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికి ఐ బొమ్మ రవి వ్యవహారంలో ఇప్పుడు తాజాగా కోర్టును ఆశ్రయించడంతో రవి కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే విషయంపై అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you