Friday, September 25, 2026
HomeLATESTiBomma Ravi: ఐ బొమ్మ రవి బ్యాంక్ ఖాతాలపై కోర్టు కీలక నిర్ణయం..!

iBomma Ravi: ఐ బొమ్మ రవి బ్యాంక్ ఖాతాలపై కోర్టు కీలక నిర్ణయం..!

iBomma Ravi: పైరసీకి సంబంధించిన ఆరోపణలతో పాటు బెట్టింగ్ యాప్‌ల కేసులో నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది.

on
- Advertisement -banner Ad

iBomma Ravi:ఐ బొమ్మ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది. పోలీసులు సీజ్ చేసిన అతడి బ్యాంకు ఖాతాలను వ్యక్తిగత లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రవికి బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఖాతాల్లో ఇప్పటికే ఫ్రీజ్ చేసి ఉంచిన రూ.3 కోట్ల నగదును మాత్రం అన్‌ఫ్రీజ్ చేయడానికి కోర్టు నిరాకరించింది.

ఆర్థిక ఇబ్బందులపై కోర్టును ఆశ్రయించిన రవి :

తన బ్యాంకు ఖాతాలు సీజ్ కావడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ఇమ్మడి రవి ఇటీవల నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. సుమారు ఎనిమిది రోజుల క్రితం దాఖలు చేసిన పిటిషన్‌లో తన ఖాతాల్లో ఉన్న నగదును వినియోగించుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. తన కుటుంబ అవసరాలను తీర్చుకోవడంతో పాటు సాధారణ లావాదేవీలు నిర్వహించేందుకు ఖాతాలను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థించాడు.

- Advertisement -
Advertisement

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం రవి (iBomma Ravi)బ్యాంకు ఖాతాల వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఖాతాల్లో ఉన్న సుమారు రూ.3 కోట్ల మొత్తాన్ని మాత్రం విడుదల చేయడానికి అంగీకరించలేదు. దీంతో ఖాతాలను లావాదేవీల కోసం ఉపయోగించుకునే అవకాశం రవికి లభించినప్పటికీ, ఫ్రీజ్ చేసిన నగదును తక్షణం వినియోగించుకునే వెసులుబాటు దక్కలేదు.

also read:Film industry:అత్యధిక ఆస్తి కలిగిన భారతీయ నటులు వీళ్లే..!

- Advertisement -
Advertisement

పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై కేసు :

ఇమ్మడి రవిపై పైరసీకి సంబంధించిన ఆరోపణలతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఐ బొమ్మ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా సినిమాలను అనధికారికంగా అందుబాటులో ఉంచి సినీ పరిశ్రమకు భారీగా నష్టం కలిగించాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. అలాగే పలు బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసి వాటి ద్వారా భారీ మొత్తంలో ఆదాయం పొందినట్లు పోలీసులు ఆరోపించారు.

ఈ కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గతేడాది నవంబర్‌లో ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా అతడికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:OTT Releases Today: హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఓటీటీలో కొత్త సినిమాల జాతర!

ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ :

కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఇమ్మడి రవికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పోలీసులు సీజ్ చేసిన తన బ్యాంకు ఖాతాలను వ్యక్తిగత లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, రవి బ్యాంకు ఖాతాలను వినియోగించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఖాతాల్లో ఉన్న నగదుపై మాత్రం కోర్టు పూర్తిస్థాయి వెసులుబాటు కల్పించలేదు.

ముఖ్యంగా ఖాతాల్లో ఉన్న సుమారు రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయకపోవడంతో ఆ మొత్తాన్ని రవి ప్రస్తుతం వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్యాంకు ఖాతాల వినియోగానికి అనుమతి లభించినప్పటికీ, నగదు విషయంలో మాత్రం రవికి పూర్తి ఊరట లభించనట్లైంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you