Friday, September 25, 2026
HomeLATESTTollywood:జైలు గోడపై టాప్ హీరో స్కెచ్..తెలుగు హీరో సినిమాపై ఫ్యాన్స్ ఫైర్!

Tollywood:జైలు గోడపై టాప్ హీరో స్కెచ్..తెలుగు హీరో సినిమాపై ఫ్యాన్స్ ఫైర్!

Tollywood:రీసెంట్‌గా విడుదలైన ఓ సినిమాలోని జైలు సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

on
- Advertisement -banner Ad

Tollywood:సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక మీమ్ హైలైట్‌గా మారింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక టాప్ తెలుగు హీరో ఫిల్మ్‌కి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీలో ఒక జైల్ సీన్ ఉంటుంది. అయితే ఆ జైల్ సీన్‌లో ఆ జైలు గోడపై ఒక టాలీవుడ్ టాప్ సీనియర్ (Tollywood)హీరో ఇమేజ్‌ని పెన్సిల్ స్కెచ్ వేస్తారు. అదే ఇప్పుడు పెద్ద రాద్ధాంతంగా మారింది.

బ్యాడ్ వర్డ్ సమయంలో హీరో పిక్చర్ చూపించడంపై ట్రోలింగ్:

ఆ టాప్ హీరో పిక్చర్‌ని పెన్సిల్ స్కెచ్ వేయించడం పెద్ద ప్రాబ్లం కాలేదు. సాంగ్ లిరిక్‌లో బ్యాడ్ వర్డ్ వస్తున్నప్పుడు ఆయన పిక్చర్ చూపించడం ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుంది. అంత పెద్ద హీరోకి సంబంధించిన పిక్చర్ వాడడమే తప్పు. వాడినా కూడా పాజిటివ్‌గా వాడాలి. కానీ ఇలా నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఆయన పిక్చర్ చూపించడం మరీ మరీ తప్పు అంటూ దారుణంగా సినిమాకి సంబంధించిన సభ్యులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ :

ఒకపక్క పెద్ద సీనియర్ హీరో ఫ్యాన్స్, మరోపక్క సినిమాలో నటించిన హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియా రచ్చ రంబోలా చేసేస్తున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కామెంట్స్‌లోనే యుద్ధం చేసుకుంటున్నారు.

also read:iBomma Ravi: ఐ బొమ్మ రవి బ్యాంక్ ఖాతాలపై కోర్టు కీలక నిర్ణయం..!

- Advertisement -
Advertisement

సినిమా రిలీజ్ అయితే చాలు.. క్షణాల్లో వైరల్ :

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా సరే సెకండ్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా రిలీజ్ అయితే చాలు.. ఆ సినిమాలో ప్లస్ ఏంటి, మైనస్‌లు ఏంటి అని చెప్పడంతో పాటు ఏ హీరోని ఎవరు టార్గెట్ చేశారు, ఎందుకు టార్గెట్ చేశారు అంటూ పెద్ద రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు.

also read:OTT Releases Today: హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఓటీటీలో కొత్త సినిమాల జాతర!

- Advertisement -
Advertisement

ఇండస్ట్రీని ముక్కలు చేసేలా ఉందంటూ కామెంట్స్ :

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మీమ్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టడమే కాదు.. సినిమా ఇండస్ట్రీని ముక్కలు ముక్కలు చేసే విధంగా ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఆ హీరో ఎందుకు అంత పెద్ద హీరో బొమ్మని తన సినిమాలో వాడుకున్నారు? వాడుకున్నా కూడా నెగిటివ్‌గా ఎందుకు చూపించారు? ఇంత ట్రోలింగ్ జరుగుతుంది అని ఆ హీరోకి తెలియదా? ఆయనకు అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి అలాంటి హీరోని టార్గెట్ చేయడం కరెక్టేనా అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినబడుతున్నాయి.

ఇప్పటివరకు అధికారికంగా స్పందించని హీరోలు:

హైలైట్ ఏంటంటే.. ఇప్పటివరకు ఆ సినిమా నటించిన హీరో గానీ, ఆ జైలు గోడపై బొమ్మ గీసిన హీరో గానీ ఎక్కడ అఫీషియల్‌గా మాట్లాడుకోలేదు. ఇన్‌సైడ్ వర్గాలు మాత్రం లోలోపల క్లాస్ పీకే ఉంటారులే అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మీమ్ పెద్ద హల్‌చల్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో పెద్ద రచ్చే రేపుతుంది.

 

View this post on Instagram

 

A post shared by @unfiltered.memes8

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you