Wednesday, November 11, 2026
HomeLATESTPriya Bhavani Shankar :పెళ్లి చేసుకోనున్న ఇరుముడి హీరోయిన్.. కాబోయే భర్త ఎవరంటే?

Priya Bhavani Shankar :పెళ్లి చేసుకోనున్న ఇరుముడి హీరోయిన్.. కాబోయే భర్త ఎవరంటే?

Priya Bhavani Shankar : ఇరుముడి చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్గా నటించిన ప్రియా భవాని శంకర్ దీపావళి సందర్భంగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది.

on
- Advertisement -banner Ad

Priya Bhavani Shankar :సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇన్నాళ్లు బ్యాచిలర్ గా ఉన్నటువంటి స్టార్స్ అయితే ఒక్కొక్కరు వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే హీరో సాయి ధరంతేజ్ ఎంగేజ్మెంట్ పూర్తి అవ్వగా.. మరో యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అలాగే స్టార్ సింగర్ అనిరుధ్ తన ప్రియురాలు కావ్య మారన్ ను వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకే మరో హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కూడా త్వరలోనే వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వినిపిస్తున్నాయి.

ప్రియుడిని పరిచయం చేసిన ప్రియా భవాని శంకర్..

పూర్తి వివరాల్లోకి వెళితే.. మొదట న్యూస్ రీడర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ప్రియా భవాని శంకర్ తన ప్రతిభతో, కష్టంతో హీరోయిన్గా పేరు సంపాదించింది. మొదట సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మేయాద మాన్ అనే చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరస హిట్లతో కోలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar )తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ కావడంతో మంచి క్రేజీ సంపాదించుకుంది. అలా ప్రియా సుపరిచితురాలే, కళ్యాణం కమనీయం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

- Advertisement -
Advertisement

also read:Tarun Bhaskar:పెళ్లిపై.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్..!

మెడలో పూలమాలతో ఫోటోలు..

గోపీచంద్ నటించిన భీమా సినిమాలో నటించి బాగానే పేరు సంపాదించింది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన ధూత అనే చిత్రంలో నాగచైతన్యకు భార్యగా నటించి అందరిని ఆకట్టుకుంది. రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇరుముడిలో కూడా రవితేజ భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈమె తమిళంలో డిమోంటి కాలనీ 3 , ఇండియన్ 3 వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ రాజ్వెల్ రాజ్ అనే వ్యక్తితో సుమారుగా 10 ఏళ్లపాటు రిలేషన్ లో ఉన్నారని, కాలేజీ రోజుల్లో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరు ప్రేమించుకున్నారని , చెన్నైలో తమకు నచ్చినట్టుగా ఒక ఇల్లును కొనుగోలు చేసి ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Kavya Maran:గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి సందడి.. కావ్యతో రొమాంటిక్ వీడియో వైరల్!

వివాహంపై క్లారిటీ త్వరలోనే..

కానీ వివాహం ఎప్పుడు అనే విషయం పై మాత్రం ఇంకా ఎవరు స్పందించలేదు. కానీ తరచు తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలను మాత్రం ప్రియా భవాని శంకర్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వినిపిస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. దీపావళి పండుగ సందర్భంగా తన ప్రియుడితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను ప్రియ భవాని శంకర్ షేర్ చేసింది.ఈ ఫోటోలే త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అనే విషయానికి బలం చేకూరుస్తోందని వినిపిస్తున్నాయి. వీరిద్దరూ సాంప్రదాయమైన దుస్తులు ధరించి , మెడలో దండలు వేసుకొని కనిపించారు..చివరిలో తన చేతికి గోరింటాకు ఉన్న ఫోటోలను పంచుకుంది ప్రియా భవాని శంకర్. వినిపిస్తున్న పెళ్లి రూమర్స్ కి చెక్ పెడతారా లేకపోతే అఫీషియల్ గా ప్రకటిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you