Dhanush – Aishwarya:కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన ధనుష్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. అలాగే మరొకవైపు రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు కోలీవుడ్ సినీ పరిశ్రమలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటువంటి సందర్భంలోనే ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం గురించి మరో చర్చ మొదలయ్యింది. అయితే విడిపోయిన తర్వాత కూడా తమ పిల్లల బాధ్యతలను పంచుకుంటూ స్నేహపూర్వకంగా తమ బంధాన్ని ఈ జంట కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక రూమర్ మరొకసారి వైరల్ గా మారేలా చేస్తోంది.
మళ్లీ కలవబోతున్న ధనుష్ – ఐశ్వర్య..
అదేమిటంటే ధనుష్9Dhanush – Aishwarya) మళ్లీ రజనీకాంత్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నారని, వీరిద్దరూ కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. ఈ ప్రచారానికి ప్రధాన అంశం ఏమిటంటే రాక్ స్టార్ అనిరుధ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ వేడుకకు ధనుష్, ఐశ్వర్య కలిసి హాజరు కాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు ధనుష్, అనిరుధ్ కాంబినేషన్ అంటే మ్యూజికల్ సెన్సేషనల్ గా ఉండేది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం కూడా ఎక్కువగా వినిపించాయి.
also read:Trivikram:ఎన్టీఆర్ మూవీ పై.. అదిరిపోయే న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..!
అనిరుద్ పెళ్లి కోసమేనా?
కానీ ఇప్పుడు ఆ విభేదాలు అన్నిటికీ కూడా పుల్ స్టాప్ పెట్టి మరి అనిరుధ్ తో ధనుష్ మళ్లీ చేతులు కలిపినట్లుగా సమాచారం. ఇద్దరూ కలిసి త్వరలోనే ఒక బడా ప్రాజెక్టు కూడా చేయబోతున్నారని వార్తలు వినిపించడంతో అభిమానులు మరింత ఆనంద పడుతున్నారు. అలాగే రజనీకాంత్ కుటుంబంతో ధనుష్ గొడవలను పక్కనపెట్టి మరి సాధారణంగా కలిసిపోతున్నట్లు వినిపిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసమే కాకుండా వ్యక్తిగత విషయాల పైన కూడా ధనుష్, ఐశ్వర్య మధ్య సన్నిహిత్యం మళ్ళీ పుంజుకుందని చర్చ జరుగుతోంది. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉంటే మాత్రం అనిరుధ్ పెళ్లి వేడుకలలో ధనుష్, ఐశ్వర్య కలిసి కనిపించే అవకాశాలు ఉన్నాయట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే అనిరుధ్ వివాహం వరకు ఆగాల్సిందే.
also read:Teja sajja:పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో తేజ సజ్జ..!
ధనుష్ సినిమాలు..
ధనుష్ 1983 జూలై 28న తమిళనాడులోని మద్రాస్ లో ప్రముఖ దర్శకుడుగా , నిర్మాతగా పేరు సంపాదించిన కస్తూరి రాజా భార్య విజయలక్ష్మి దంపతులకు వెంకట్ ప్రభు కస్తూరి రాజాగా జన్మించారు. ధనుష్ మొదట హోటల్ మేనేజ్మెంట్ చదివినప్పటికీ తన అన్నయ్య సెల్వరాఘవన్ డైరెక్టర్ కావడం చేత నటుడు కావాలని ఒత్తిడి చేయడంతో ధనుష్ గా పేరు మార్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2002 లో తులువదో ఇలమై సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ధనుష్ ప్రస్తుతం ఓం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా మరో రెండు చిత్రాలు కూడా ధనుష్ చేతిలో ఉన్నాయి. చివరిగా కర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు ధనుష్.




