Thursday, October 22, 2026
HomeLATESTJailer 2:జైలర్ 2 లో మోహన్ లాల్ కి డూప్ వాడారా..?

Jailer 2:జైలర్ 2 లో మోహన్ లాల్ కి డూప్ వాడారా..?

Jailer 2: రజనీకాంత్ జైలర్ టు చిత్రంలో మోహన్ లాల్ కి బాడీ డబుల్స్ ఉపయోగించారు అంటూ వస్తున్న వార్తలపై జోబి క్లారిటీ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Jailer 2:దసరా కానుకగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చాలామంది స్టార్ హీరోల క్యామియోలు విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా జైలర్ సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ జైలర్ 2 లో కూడా కంటిన్యూగా కనిపించారు. అయితే స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలను కట్ చేసారని అభిమానులలో ఒక చర్చ మొదలయ్యింది.

జైలర్ 2 లో మోహన్ లాల్ కి బాడీ డబుల్

మరొక విషయం మోహన్ లాల్ బాడీ డబుల్ తో షూట్ చేశారనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. జైలర్ సినిమాలో మాథ్యూ పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తారు. పార్ట్ 2 లో కూడా ఆయనకు సరైన ఇంట్రడక్షన్ సీన్ ఇవ్వలేదు క్లైమాక్స్లో కార్ చేజింగ్ సీన్లో మోహన్ లాల్ ఫేస్ కూడా సరిగ్గా చూపించలేదు. వీటికి తోడు మోహన్లాల్ బాడీ డబుల్ నటించే జోబీ జైలర్ 2 (Jailer 2)సెర్చ్ నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేశారు. దీనితో మోహన్ లాల్ లుక్కులో కనిపించడంతో క్లైమాక్స్లో మోహన్ లాల్ బదులుగా జోబీ నటించారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన తాజాగా జోబీ క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Ramayana OTT:రామాయణం రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా డబ్బులు కట్టాల్సిందేనా?

సమాధానమిచ్చిన జోబీ..

జోబీ మాట్లాడుతూ జైలర్ 2 చిత్రంలోని మోహన్ లాల్ పాత్రకు సంబంధించి కొన్ని సీన్స్ మాత్రమే తాను బాడీ డబుల్ గా పని చేశానంటూ తెలిపారు. సినిమాలో తన ముఖాన్ని ఎక్కడా ఉపయోగించలేదని క్లారిటీ ఇచ్చారు. కొన్ని షాట్లలో తన చేతులు కాళ్లు మాత్రమే కనిపిస్తాయని, ముఖ్యంగా క్లైమాక్స్లో కారు నడిపే సీన్లో గేరు మార్చడం, ఎక్సలేటర్ తొక్కడం వాటి షార్ట్స్ కి మాత్రమే తనను ఉపయోగించారని వెల్లడించారు. క్లైమాక్స్లో కనిపించే ముఖం కూడా తనది కాదని, ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Upasana Konidela:చరణ్‌ను అలా చూడలేను.. ఉపాసన మనసులో మాట ఇదే!

ఆ అత్యుత్సాహంతోనే అలా చేశానంటూ క్లారిటీ..

మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల డేట్స్ కి సంబంధించి ఇబ్బందుల వల్లే బాడీ డబుల్స్ కొన్ని చోట్ల ఉపయోగించారని జోబీ తన అభిప్రాయంగా వెల్లడించారు. జైలర్ 2 సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేయడం తన తప్పే అంటూ తెలిపారు జోబీ. రజనీకాంత్ సినిమాలో పనిచేశాననే ఆనందంతో తన గురించి అందరికీ తెలియాలనే ఉత్సాహంతోనే ఆ ఫోటోలను షేర్ చేశాను అంటూ తెలియజేశారు. ఆ తర్వాత తన తప్పులు తెలుసుకొని మరీ ఆ ఫోటోలను డిలీట్ చేసినట్లు తెలిపారు. మోహన్లాల్ పైన తనకు చాలా అభిమానం ఉందని ఆయనతో పోలిక ఉండడమే తనకు ఈ అవకాశాలను అందించేలా చేసింది అంటూ జోబీ వివరించారు. ఇలా క్లారిటీ ఇచ్చినప్పటికీ మోహన్లాల్ పాత్రపై కూడా చర్చ జరుగుతూనే ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you