Friday, October 23, 2026
HomeLATESTTrivikram:ఎన్టీఆర్ మూవీ పై.. అదిరిపోయే న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..!

Trivikram:ఎన్టీఆర్ మూవీ పై.. అదిరిపోయే న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..!

Trivikram: ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఎన్టీఆర్ మూవీ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Trivikram:టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు వీరి కాంబినేషన్లో వస్తున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ చిత్రం గాడ్ ఆఫ్ వార్. ఈ చిత్రాన్ని హిందూ దేవతలలో ఒకరైన సుబ్రహ్మణ్యస్వామి స్టోరీ ఆధారంగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ ఇందులో సుబ్రహ్మణ్యస్వామిగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు పైన త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఎన్టీఆర్ మూవీ పై త్రివిక్రమ్ కామెంట్స్..

జగపతిబాబు హోస్టుగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2కి గెస్ట్ గా వచ్చిన త్రివిక్రమ్(Trivikram) శ్రీనివాస్ తాను తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ కోసం ఈ షోకి హాజరయ్యారు. త్రివిక్రంతో పాటుగా నటుడు సునీల్, సంగీత దర్శకుడు తమన్ అతిథులుగా వచ్చారు. వీరిందరితో సరదాగా సమాధానాలు చెప్పించిన జగపతిబాబు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్న సినిమా పైన ప్రశ్నించగా వాటికి సంబంధించి త్రివిక్రమ్ స్పందిస్తూ అభిమానులకు ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నా మనసులో ఆరు ముఖాలు కలిగిన ఒక రూపం ప్రత్యక్షం కాగానే సంభాషణలు వాటంతట అవే వచ్చేసాయి. బహుశా అది కేవలం నా ఆలోచన మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ దైవ సంకల్పం ఏమో అంటూ త్రివిక్రమ్ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Teja sajja:పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో తేజ సజ్జ..!

ప్రాజెక్టుపై అంచనాలు పెంచిన త్రివిక్రమ్..

త్రివిక్రమ్ మాట్లాడుతున్న సమయంలో.. ఆయన మాటలు చెబుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన గంభీరథ, అపారమైన విశ్వాసం ప్రాజెక్టును ఏ స్థాయిలో ఉండబోతోంది అనే విషయం చెప్పకనే కనిపిస్తున్నాయి. ఆరు ముఖాలు అంటే షణ్ముఖుడైన కార్తికేయ స్వామి అవతారమే అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గత కొద్దిరోజులుగా ఇంటర్నేషనల్ ప్రాజెక్టును గాడ్ ఆఫ్ వార్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత నాగవంశీ దీనిపైన స్పందిస్తూ ఈ పేరు అధికారికమైనది కాదు అని ఇంకా టైటిల్ ని కూడా ఖరారు చేయలేదంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Kalki 2:ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ‘కల్కి 2’ నుంచి స్పెషల్ వీడియో విడుదల!

ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం..

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి . దైవిక యుద్ద వీరుడుగా ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారు అనే విషయంపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాతే త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టులో కనిపించబోతున్నారు. ఇందులో ఆధ్యాత్మిక గంభీరం విశ్వరూపం వంటి నటన కలిగిన పాత్రలలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అని, చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మొదటిసారి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఇలాంటి విభిన్నమైన కథాంశంతో రాబోతుండడం గమనార్హం.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you