Actress Rajitha:ఈ మధ్యకాలంలో చాలా ఇండస్ట్రీలలో కొత్తవాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో పాత నటీనటులకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఒకవేళ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా.. సరైన పాత్రలు పడడం లేదు. దీంతో చాలామంది సెలబ్రెటీలు సినిమాలకు దూరమవుతున్నారు. ఇప్పుడు అలాంటి కోవలోనే ఒక టాలీవుడ్ సీనియర్ నటి తమకు అవకాశాలు కల్పించండి అవి బి గ్రేడ్ సినిమాలైనా పరవాలేదు అంటూ వేడుకుంటుంది. ఆమె ఎవరో కాదు సీనియర్ నటిగా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులర్ సంపాదించుకున్న నటి రజిత.
సీనియర్స్ కి కూడా అవకాశాలు కల్పించండి – రజిత
తాజాగా మౌళి హీరోగా దొంగ నా కొడుకు అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నటి రజిత(Actress Rajitha) అభిమానులను అకట్టుకుంటూ భాగోద్వేగ ప్రసంగం చేసి అందరిని ఆకట్టుకుంది. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న తాను ఒక మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని, అటువంటి తరుణంలోనే దొంగ నా కొడుకు సినిమాలో అవకాశం వచ్చిందని వెల్లడించింది. ఎన్నో మంచి విజయాలు అందుకున్న చిత్రాలలో నటించాను. పెద్దపెద్ద హీరోలతో కూడా నటించాను. అయితే ఈ మధ్యకాలంలో మంచి క్యారెక్టర్లు రావడం లేదు. నన్ను మర్చిపోతున్నారేమో అని భయపడుతున్న సమయంలో నాకు ఈ అవకాశం లభించింది అంటూ తెలిపింది రజిత.
also read:Rashmika Mandanna:జాన్వీ కపూర్ వివాదంపై.. రష్మిక కామెంట్స్..!
దొంగ నా కొడుకు మూవీ ఆఫర్ పై కామెంట్..
నటి రజిత మొదట ఈ ఆఫర్ వచ్చిందంటే తాను నమ్మలేదని, ఫేక్ కాల్ అనుకున్నాను అని, డైరెక్టర్ డిపార్ట్మెంట్ నుంచి నిఖిల్ కాల్ చేసినప్పుడు నేను కాదులే అనుకొని ఫోన్ పెట్టేసాను . కానీ ఆ తర్వాత నటుడు ఆలీకి ఫోన్ చేసి అడిగితే అవును రజిత.. స్టోరీ చాలా బాగుంది అని ఆలీ గారు చెప్పడంతో ఆ ఆఫర్ స్వీకరించాను అంటూ ఆమె తెలియజేసింది. ఈ సంవత్సరం తనకు వచ్చిన మొట్టమొదటి ఆఫర్ ఇదే అని తన కెరీర్ కు మంచి కం బ్యాక్ ఇస్తుందంటూ తెలియజేసింది నటి రజిత. ఈ విషయంపై తనను ప్రేక్షకులు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడించింది.
also read:Rashmika Mandanna:జాన్వీ కపూర్ వివాదంపై.. రష్మిక కామెంట్స్..!
చిత్ర బృందానికి రజిత ప్రత్యేక కృతజ్ఞతలు..
రజిత మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించిన మౌలికి , డైరెక్టర్ శ్రీను కంబాల గారికి, మైత్రి మూవీ మేకర్స్ కు ప్రత్యేకించి మరి కృతజ్ఞతలు తెలియజేసింది. మౌలికి తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్నదని, దొంగ నా కొడుకు టైటిల్ వినగానే అందరి ముఖంలో కూడా ఒక చిరునవ్వు కనిపిస్తోందంటూ తెలియజేశారు . ఈ సినిమా మౌలికి కూడా మంచి విజయం అందించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపింది. నటుడు ఆలీతో కలిసి తాను ఎన్నో చిత్రాలు చేశానని, మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో పూర్తిస్థాయి పాత్రలో చేయడం మరింత ఆనందంగా ఉందంటూ తెలియజేసింది నటి రజిత. సినిమా మొత్తం ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారంటూ తెలియజేసింది. తమకు అవకాశాలు కల్పించాలని , కనీసం బి కేటగిరి పాత్రలైనా మేము చేస్తాం కదా అలాంటి అవకాశాలు ఉంటే కల్పించండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే అంటూ తెలియజేసింది.




