Thursday, October 22, 2026
HomeLATESTRashmika Mandanna:జాన్వీ కపూర్ వివాదంపై.. రష్మిక కామెంట్స్..!

Rashmika Mandanna:జాన్వీ కపూర్ వివాదంపై.. రష్మిక కామెంట్స్..!

Rashmika Mandanna: రష్మిక మందన్న జాన్వి కపూర్ వివాదం పై స్పందిస్తూ.. ప్రతి ఒక్కరికి కొన్ని హద్దులు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది..

on
- Advertisement -banner Ad

Rashmika Mandanna:సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ప్రయాణం ఎప్పుడూ ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి సక్సెస్, వేల్యూ రెండు వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ హద్దులు , తెరపైన పాత్రలు , వేసే దుస్తుల విషయంలో కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు హీరోయిన్స్. తాజాగా టాలీవుడ్ క్యూట్ కపుల్స్ విజయ్ దేవరకొండ, రష్మిక(Rashmika Mandanna) కరణ్ జోహార్ నిర్వహించినటువంటి టాక్ షోలో పాల్గొన్నారు. అందులో రష్మిక తన కెరీర్లు జరిగిన విషయాలు గ్లామర్ షో పైన ఎలాంటి మొహమాటం లేకుండా పలు విషయాలను తెలియజేసింది.

జాన్వీ కపూర్ వివాదం పై స్పందించిన రష్మిక..

ఇటువంటి సందర్భంలోనే ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ వేసుకున్న వస్త్రధారణ గురించి పెద్ద చర్చ జరిగింది. ఈ విషయం పైన కరణ్ జోహార్.. పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ ,రష్మిక లను కూడా ఈ ఇబ్బందుల గురించి ప్రశ్నించారు.. దర్శక నిర్మాతలతో పనిచేసేటప్పుడు దుస్తుల ఎంపిక , పాత్రల ప్రదర్శన విషయం పైన ఏవైనా హద్దులు ఉన్నాయా అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు?. ఈ విషయంపై రష్మిక మాట్లాడుతూ తెరపై తాను కనిపించే విధానం పైన తనకు స్పష్టమైన అవగాహన ఉందంటూ రష్మిక క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -
Advertisement

also read:Kiccha Sudeep:కిచ్చా సుదీప్ భార్యతో విడిపోవాలనుకోవడానికి కారణం..?

కొన్ని విషయాలలో నేను రాజీపడను..

కొన్ని పాత్రలకు బికినీ లేదా బోల్డ్ దుస్తులు కథపరంగా అవసరం అయి ఉండవచ్చు. అయితే వ్యక్తిగతంగా తనకు మితిమీరిన ఎక్స్పోజింగ్ లేదా స్కిన్ షో చేయడం పెద్దగా ఇష్టం ఉండదంటూ తెలియజేసింది. కొన్ని విషయాలలో నేను అసలు రాజీపడను సహజంగానే నేను అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిని కాను అంటూ తేల్చి చెప్పేస్తానని కమర్షియల్ చిత్రాలలో నటిస్తున్నప్పుడు హీరోయిన్స్ కి కొన్ని ప్రత్యేక డిమాండ్లు ఎదురవుతూ ఉంటాయి.. పాటలు , గ్లామర్ సీన్స్ లలో కొన్ని రకాల కాస్ట్యూమ్స్ ధరించాల్సి వచ్చినప్పుడు అవి పూర్తి సౌకర్యంగా అనిపించకపోవచ్చు. ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement

also read:Jailer 2:జైలర్ 2 లో మోహన్ లాల్ కి డూప్ వాడారా..?

నా హద్దులు ఏంటో నాకు తెలుసు..

అయితే తాను అలాంటి పరిస్థితులలో మాత్రం ఎక్కడ ఆగాలో తనకి బాగా తెలుసు.. కొన్ని స్పష్టమైన హద్దులను స్వయంగా తాను నిర్ణయించుకుంటానని, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్న రష్మిక స్టార్ డం కోసం వ్యక్తిగత సౌకర్యాన్ని, విలువలని వదులుకోనంటూ తెలియజేసింది. తనకు కూడా కొన్ని హద్దులు ఉంటాయని తెలియజేసింది రష్మిక. ఎవరి ఒత్తిళ్లకు తాను తగ్గను అని, ఒక గీత గీసుకొని ముందుకు సాగుతున్న సినీ ప్రయాణాన్ని ఇకమీదట కూడా అలాగే కొనసాగిస్తానని తెలియజేసింది. తనకు ఎలాంటి డౌట్లు వచ్చినా ఎలాంటి విషయాలలోనైనా సరే కచ్చితంగా విజయ్ దేవరకొండ సలహాలు తీసుకుంటానని తెలియజేసింది రష్మిక. దసరా కానుకగా రష్మిక ,విజయ్ దేవరకొండ కలిసి నటించిన రణబాలి సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో రష్మిక మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you