Isakapatnam Movie Review:వెబ్ సిరీస్: ఇసక పట్నం
నటీనటులు: ఐశ్వర్య రాజేష్, రాజీవ్ కనకాల, సునీల్, సముద్ర ఖని, నరేష్ అగస్త్య, బెనర్జీ రాజా చెంబోలు తదితరులు.
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
డైరెక్టర్: గ్యారీ బి.హెచ్
స్టోరీ విషయానికి వస్తే:
తీర ప్రాంతమైన ఇసుక పట్టణంలో ప్రజల మనిషిగా గుర్తింపు సంపాదించుకున్న చిన్న రావు (రాజీవ్ కనకాల), పొట్టకూటి కోసం అక్కడికి వలస వచ్చిన నాయుడు (సముద్రఖని) చిన్న రావు దగ్గరే పనిలో చేరి, అతడినే చంపి ఆ నగరానికి తానే రాజుగా ఎదుగుతాడు. అక్కడ పోలీస్ సపోర్టుతో తిరుగులేని నాయకుడిగా ఒక శక్తిగా ఎదుగుతారు. అయితే తండ్రి చేసే అరాచకాలు కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్) కి నచ్చదు. మరొకవైపు ప్రతాప్ వర్మ (రవి వర్మ) నాయుడుని ఎలాగైనా గద్దె దించాలని చూస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే వర్మను ఎదుర్కోవడానికి నాయుడు వేసే వ్యూహాలు ఏమిటి? వారిద్దరి మధ్య గొడవలు ఎలాంటి పరిణామాలకు దారి తీసాయి అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ.
ప్లస్ పాయింట్స్:
ఈ సిరీస్ లో సముద్ర ఖని మాత్రమే తన నటనతో మెప్పించారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ పరవాలేదు అనిపించుకుంది.
also read:Sukumar:రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్న సుకుమార్!
మైనస్ పాయింట్స్:
నటనలో ఉదాసీనత.. కథనం చెత్తగా ఉండడం, సినీ ప్రేక్షకులను నిరాశపరిచింది. సన్నివేశాలను అసంపూర్తిగా రాసుకున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నా.. వారి నటనను ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. దర్శకత్వం చాలా సాధారణంగా ఉంది. సినిమా కూడా నెమ్మదిగా మొదలవుతుంది. ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాలను మనం ఇదివరకే ఎన్నో చూసాం.. అందుకే ఇందులో కొత్తదనం ఏం కనిపించడం లేదు.
also read:Nani:హీరో నానికి గాయం.. ఆందోళనలో అభిమానులు.!
టెక్నికల్ టీమ్:
సాంకేతికంగా చూస్తే ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం కూడా సోసో గానే ఉన్నది. 1980 కాలంనాటి డార్క్ మోడ్ ఇసకపట్నంలో వాతావరణన్ని చూపించిన సినిమాటోగ్రఫీ వంశీ పచ్చిపులుసు బాగా క్యాప్చర్ చేశారు. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. డైరెక్టర్ గ్యారీ బి.హెచ్ ఇంకా మెరుగైన ఔట్పుట్ ఇవ్వాల్సింది. పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ సీన్లు ప్రజెంట్ చేయలేకపోయారు.
చివరిగా..
ఇసకపట్నం పూర్తిగా నిరాశపరిచింది. అసలు ప్రైమ్ ఛానెల్ ఇలాంటి కంటెంట్‌ను ఎలా అంగీకరించిందో ఆశ్చర్యంగా ఉంది. కచ్చితంగా ఇది నిరాశపరిచే సినిమా. ఇంత గొప్ప నటులను సరిగ్గా ఉపయోగించుకోలేదు.


