Jabardasth Babu:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తనదైన కామెడీతో ఆకట్టుకున్న షో జబర్దస్త్ షో.. ఈ షో ద్వారా ఎంతమంది కమెడియన్సు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కొంతమంది ఇండస్ట్రీలో కమెడియన్స్ గా, హీరోలుగా, డైరెక్టర్లుగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఒక జబర్దస్త్ కమెడియన్ త్వరలోనే ఒక ఇంటి వారు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ కమెడియన్ ఎవరో కాదు లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా మారి మంచి పేరు సంపాదించుకున్న బుల్లితెర నటుడు బాబు.
పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..
కమెడియన్ బాబు పెళ్లి వార్త ప్రస్తుతం బుల్లితెర వర్గాలలో మరింత ఆసక్తి పెంచేలా చేసింది.. ముఖ్యంగా బాబు వివాహం చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం పైన పలువురు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. బాబు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అమూల్య.. ఈమె మంచిర్యాల జిల్లాకు చెందిన యువతి అన్నట్లుగా సమాచారం. ఈమె బి ఫార్మసీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె కేవలం చదువులోనే కాకుండా సోషల్ మీడియా , మీడియా రంగాల పైన కూడా మంచి ఆసక్తి ఉంది.
also read:Ashika Ranganath:జిమ్‌లో అందాల ఆరబోత.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఆషిక రంగన్నాథ్..!
అమ్మాయి ఎవరంటే?
ఆ ఆసక్తితోనే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న అమూల్య.. గతంలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో న్యూస్ యాంకర్ గా కూడా పేరు సంపాదించింది. ఇప్పుడు సోషల్ మీడియా వైపు అడుగులు వేసి తన ప్రతిభను చూపిస్తోంది. నటుడు నుంచి డైరెక్టర్ గా మారి మంచి పాపులారిటీ సంపాదించిన బాబు యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అమూల్యను వివాహం చేసుకోబోతున్నారని తెలిసి ఈ జంటకు అభిమానులు, నేటిజన్స్ సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇద్దరి పరిచయం , పెళ్లి ,వివాహ వేడుకకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read:Tollywood:రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరిన దర్శకులు వీళ్లే.. టాలీవుడ్ నుంచి ఒక్కడే!
సుధీర్ మీ పెళ్లెప్పుడు?
మొత్తానికి జబర్దస్త్ బాబు (Jabardasth Babu)కూడా త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. కానీ ఇప్పటివరకు కమెడియన్ గా హీరోగా పేరు సంపాదించిన సుధీర్ మాత్రం ఇంకా తన వివాహ విషయంలో వెనకడుగు వేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవలే సుధీర్ హీరోగా నటించిన గోట్ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో తన తదుపరి సినిమా ఏంటి అనే విషయం పైన కూడా ఎలాంటి స్పష్టత లేదు. కేవలం బుల్లితెర పైన షోలకు యాంకర్ గా వెళ్తూ ముందుకు వెళ్తున్నారు సుధీర్.మరి రాబోయే రోజుల్లోనైనా వివాహ విషయంపై స్పందిస్తారేమో చూడాలి.




