MM keeravani:తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ విజేత , ప్రముఖ సంగీత దర్శకుడుగా పేరు సంపాదించిన ఎం ఎం కీరవాణి గురించి ఎంత చెప్పినా తక్కువే.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించే ప్రతి సినిమాకి కూడా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ మంచి విజయాలను అందిస్తారు. అయితే అలాంటి కీరవాణి గురించి నిన్నటి రోజు నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారింది.. అదేమిటంటే తన శారీరక మార్పుతో అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా 22 కిలోల బరువు తగ్గి పూర్తిగా సరికొత్త లుక్కులో కనిపించారు.
22 కిలోల బరువు తగ్గిన కీరవాణి..
తాజాగా హైదరాబాదులో కీరవాణిని కలిసిన ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఆయన మార్పును చూసి ఫీదా అవుతూ కీరవాణి (MM keeravani)పట్టుదల, క్రమశిక్షణ చాలామందికి స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కీరవాణిని కలిసిన అనుపమ్ ఖేర్ ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.. కీరవాణి 22 కిలోల బరువు తగ్గడం నిజంగా ఒక అద్భుతమైన విషయము అని, బరువు తగ్గిన తర్వాత ఆయన మరింత ఉత్సాహంగా, ఆనందంగా , ఆత్మవిశ్వాసంగా, సంతోషంగా కనిపిస్తున్నారని ఆయన నడకలోను ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందంటూ అనుపమ్ ఖేర్ తన పోస్టులో తెలియజేశారు.
also read:Chiranjeevi:మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి అరుదైన గుర్తింపు..!
ప్రశంసలు కురిపించిన అనుపమ్ ఖేర్..
సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన కీరవాణి ఇప్పుడు తన ఆరోగ్య విషయం పైన కూడా చాలా పట్టుదలతో, ఏకాగ్రతతో ఏదైనా సాధించవచ్చు అంటూ నిరూపించారు అని ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ ప్రశంసించారు. ఆయన జీవితంలో ప్రారంభమైన ఈ కొత్త ఫిట్నెస్ ప్రయాణం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానంటూ నటుడు అనుపమ్ ఖేర్ తెలియజేశారు ప్రస్తుతం అనుపమ్ ఖేర్ షేర్ చేసిన ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు కూడా కీరవాణిని ప్రశంసిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతూ అభినందనలు తెలియజేస్తున్నారు.
also read:Kajal Agarwal:తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కాజల్ అగర్వాల్!
కీరవాణి కెరియర్..
కీరవాణి కెరియర్.. రాంగోపాల్ వర్మ 1991లో తెరకెక్కించిన క్షణం క్షణం చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. కీరవాణి కెరియర్ లో అన్నమయ్య, క్రిమినల్, మగధీర, బాహుబలి, RRR తదితర చిత్రాలకు ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 2023లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు కీరవాణి. ఈ భారీ ప్రాజెక్టు కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా కీరవాణి మరింత స్లిమ్ముగా మారి అందరికీ షాక్ ఇస్తారేమో చూడాలి మరి.
View this post on Instagram




