Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. నయనతార హీరోయిన్గా నటించింది. చిరంజీవి కెరీర్ లోనే మొదటిసారి రూ.300 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా పేరు సంపాదించింది. ప్రస్తుతం డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో కాకా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి బరిలో కూడా చాలా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.
అరుదైన గౌరవాన్ని అందుకున్న మన శంకర వరప్రసాద్ గారు..
చిరంజీవి నటిస్తున్న మరో సోసియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా హీరోయిన్గా త్రిషతోపాటు మరికొంతమంది నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలుపెట్టినా ఇప్పటివరకు సరైన అప్డేట్ మాత్రం రాలేదు. ఇటువంటి తరుణంలోనే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ కట్ పూర్తి అయినట్లుగా డైరెక్టర్ తెలియజేయడంతో అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. అలాగే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది.
also read:Kajal Agarwal:తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కాజల్ అగర్వాల్!
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక ప్రదర్శన..
ప్రస్తుతం విశ్వంభర సినిమా ట్రైలర్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. గోవాలో జరగనున్న 57వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఇండియన్ పనోరమ విభాగానికి సంబంధించి ఈ సినిమా అధికారికంగా ఎంపికైనట్లు తెలుస్తోంది. జాతీయస్థాయి చలనచిత్ర వేడుకలలో ఈ గుర్తింపు రావడంతో అటు చిత్ర బృందంతో పాటు మెగా అభిమానులు కూడా మరింత ఆనంద పడుతున్నారు. ఎంతోమంది అభిమానులను అలరించిన చిరంజీవి ఖాతాలో మరో ప్రత్యేకమైన గుర్తింపు చేరిందని చెప్పవచ్చు.
also read:Sameera Reddy:గోవాలో ఇల్లు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్..లోపల ఇన్ని ప్రత్యేకతలా!
విశ్వంభర ట్రైలర్ కు సర్వం సిద్ధం..
సోసియో ఫాంటసీగా నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా భారీ విజువల్ ఎఫెక్ట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం కూడా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూసినప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోంది. సాంకేతిక పనుల కారణం చేత ఈ సినిమా ఆలస్యం అవుతుందనే విధంగా వినిపిస్తున్నాయి. తాజా ట్రైలర్ కూడా సిద్ధం అవ్వడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా థియేటర్ రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. మరి ట్రైలర్ తో రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారా అని అభిమానులు ఎదురు చేస్తున్నారు.
గత కొద్దిరోజులుగా వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న కాకా, విశ్వంభర సినిమాలు ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని వినిపించాయి.. ఈ విషయం పైన అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఇవన్నీ కూడా కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. కాకా సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. మరి ఈ సినిమాతో ఎటువంటి రికార్డు అందుకుంటారో చూడాలి.




