OM Movie:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఓం ప్రాజెక్ట్ 1. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి సినిమా పైన మరింత అంచనాలు పెంచేశాయి. ఇందులో సాయి పల్లవి , శ్రీ లీల ఇద్దరు నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఓం సినిమా టైటిల్ ని మేకర్స్ మార్చినట్లుగా వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం..
ధనుష్ మూవీ టైటిల్ ని మార్చబోతున్నారా?
ఓం సినిమా టైటిల్ ని ఓ.o..(OM) గా మార్చబోతున్నారనే విషయం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టైటిల్ విషయంలో సెన్సార్ పరమైన అభ్యంతరాలు రావడంతో మేకర్స్ ఈ రకమైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఇలాంటి సెన్సార్ మార్పు కొత్తేమీ కాదు. గతంలో కూడా విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి గాను సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబి డియోల్ పాత్రకు సంబంధించి ఓం అనే పదాన్ని ఉపయోగించారు. సెన్సార్ అభ్యంతరాలు కారణం చేత MM గా మార్చాల్సి వచ్చింది.
also read:Disha patani: మత్తెక్కించే చూపులతో గిలిగింతలు పెడుతున్న దిశాపటాని!
సెన్సార్ అభ్యంతరాలపై గతంలోనే డైరెక్టర్ క్లారిటీ..
ఇప్పుడు సరిగ్గా అదే ధనుష్ సినిమా టైటిల్ విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాకి అసలు ఓం (OM Movie)అనే టైటిల్ ఎందుకు పెట్టారు దీని ఆధ్యాత్మికతకు లేదా పరమశివుడికి ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులలో మొదలవుతున్నాయి వీటిపైన డైరెక్టర్ రాజ్ పెరియా స్వామి గతంలో ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సినిమా కథ ప్రధానంగా రెండు పుణ్యక్షేత్రాలైన తిరుపతి తిరువన్నమలై పట్టణాల మధ్య కొనసాగుతుందని తెలియజేశారు.
also read:Dil Raju:టాక్సిక్ సినిమాతో నష్టాలు రాలేదు..లాభాలే వచ్చాయి.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో?
ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి పాత్రకు సంబంధించి ఒక ఆపరేషన్ కోడ్ నేమి OM అని ఈ సినిమాలోని కథలోని పాత్రల జీవితాలలో కూడా ఆధ్యాత్మికతకు చాలా ప్రాధాన్యత ఉంటుందంటూ వివరించారు ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి ఓం అనే టైటిల్ పెట్టినప్పటికీ సెన్సార్ రూల్స్ ప్రకారం ఈ చిత్రం టైటిల్ ని O.M గా మార్చబోతున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ మార్పు పైన చిత్ర బృందం నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి .నవంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.




