Kareena Kapoor:బాలీవుడ్లో బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు సంపాదించిన సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ జంట గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ పలు చిత్రాలలో నటిస్తూ విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా నిరంతరం సోషల్ మీడియాలో తమదైన స్టైల్ లో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. గడిచిన కొన్ని నెలల క్రితం హీరో సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడి సంఘటన ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ విషయం పైన సైఫ్ అలీఖాన్ భార్య నటి కరీనాకపూర్ షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
సహాయం కోసం రోడ్డుమీదకి వచ్చాను..
సైఫ్ అలీ ఖాన్ నివాసంలో జరిగిన ఈ ఘటన బాలీవుడ్ ను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. దాడి జరిగిన తెల్లవారుజామున అసలు ఏం జరిగిందో కరీనాకపూర్ వివరిస్తూ చాలా ఎమోషనల్ అయింది. ఆరోజు రాత్రి తాను వేసుకున్న నైట్ టీ షర్టుతో ఎలాంటి హంగులు లేకుండా రోడ్డుపైనే సహాయం కోసం చాలా పరిగెత్తానని, రక్తంతో తడిసి ముద్దైనా నా భర్తని కాపాడుకోవడం కోసం దారిలో వెళ్లే వాహనాలను ఆపుతూ చాలా గట్టిగా కేకలు వేశానని , ఈ భయానక దృశ్యం ఒక సినిమాని తలపించేలా ఉందని , ఆ సమయంలో తనను ఎవరు వీడియో తీయకపోవడం అదృష్టంగా భావించానని తెలిపింది కరీనాకపూర్(Kareena Kapoor).
also read:Regina Cassandra:సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేస్తారా? జాన్వీ, రాధికాపై రెజీనా ఫైర్!
నాన్న నువ్వు చనిపోయావా – తైమూర్
సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. తన పైన దుండగుడు పదిసార్లు కత్తితో దాడి చేశారని, తన కుమారుడు తైమూర్ భయపడిపోయి.. నాన్న నువ్వు చనిపోయావా అని అడిగిన క్షణాలు తనని చాలా కలిచి వేసాయి అంటూ తెలియజేశారు. ఆ దుండగుడు ఉపయోగించిన కత్తి నాసిరకం కావడం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డాను అని లేదంటే పరిస్థితి మరొక లాగా ఉండేదంటూ సైఫ్ అలీ ఖాన్ తెలియజేశారు. అయితే ఆ దాడి జరిగిన రోజు రాత్రి ఇంట్లో డ్రైవర్లు ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రికి చేర్చడంలో చాలా ఇబ్బందికరంగా మారిందని తెలియజేశారు.
also read:Vijay Thalapathy:వైఎస్ ఫ్యామిలీ పెళ్లికి విజయ్ ఎవరితో వచ్చారో తెలుసా?
ఆరు నెలలుగా సరైన నిద్ర లేదు..
ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో తాను చాలా ప్రశాంతంగా కనిపించడంతో సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వచ్చాయని, అసలు దాడి జరిగిందా లేదా అనే కొంతమంది అనుమానాలను వ్యక్తం చేశారని తెలిపారు సైఫ్ అలీ ఖాన్.. బయటికి తాను చాలా ధైర్యంగా కనిపించినప్పటికీ ఆ సంఘటన తమ కుటుంబం పైన చాలా ప్రభావాన్ని చూపించింది అంటూ కరీనాకపూర్ తెలియజేసింది. ఆ భయానక అనుభవం కారణం వల్ల తాము దాదాపుగా ఆరు నెలల పాటు సరిగ్గా నిద్ర పోలేదని ఆవేదనతో తెలియజేసింది కరీనాకపూర్. ఈ మధ్యకాలంలో తరచూ బాలీవుడ్ సెలబ్రిటీల పైన ఏదో ఒక అటాక్ అయితే జరుగుతూ ఉంది. టైగర్ ష్రాఫ్ పై కాల్పులు కూడా జరిపారు. అంతేకాకుండా తాజాగా నటుడు తుషార్ కపూర్ ని కూడా ఐదు కోట్లు ఇవ్వాలని లేకపోతే లేపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.




