ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి కావ్య శ్రీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఈ సీరియల్ తో అపారమైన ప్రజాధారణ సొంతం చేసుకుంది.
ఈ సీరియల్ తర్వాత కోయిలమ్మ, గువ్వా గోరింక, చిన్ని, మంగళ గౌరీ మధువే వంటి సీరియల్స్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
అంతేకాదు ఆహాలో ప్రసారమయ్యే చెఫ్ మంత్ర షోలో కూడా సందడి చేస్తున్న ఈమె.. పలు వినోద కార్యక్రమాలు , రియాలిటీ సెగ్మెంట్లలో కూడా చురుకుగా పాల్గొంటుంది
తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకున్న కావ్య శ్రీ .. అందులో తన అద్భుతమైన ఔట్ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
హెవీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఆరంజ్ కలర్ లెహంగా ధరించిన ఈమె.. ఇందులో తన గ్లామర్ లుక్కుతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. తాజాగా ఈమె షేర్ చేసిన లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.