kajal agarwal :బాలీవుడ్ లో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణం. సుమారుగా 4000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా.. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, యశ్ రావణాసురుడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో రకుల్ ప్రీతిసింగ్ శూర్పనక పాత్రలో కనిపించబోతున్నారు. ఇలాంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు దొరికినా సరే పెద్ద స్టార్స్ కూడా నటిస్తూ ఉంటారు. దీంతో ప్రమోషన్స్ లో కూడా సందడి చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
కాజల్ అగర్వాల్ రామాయణ చిత్రంలో నటిస్తోందా? లేదా?
అయితే మోస్ట్ అవైటెడ్ చిత్రంగా రామాయణ ప్రమోషన్స్ చిత్ర బృందం మొదలుపెట్టారు. కానీ ఇందులో టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఒక పాత్రలో నటించబోతుందని గతంలో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా గతంలో రామాయణ సినిమాకి సంబంధించి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లలో పోస్టులు షేర్ చేసింది. కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించి ఎలాంటి పోస్టర్ కూడా విడుదల కాలేదు. దీంతో అసలు కాజల్ అగర్వాల్ రామాయణ సినిమాలో భాగమైందా లేదా అనే సందేహాలు ఇప్పుడు అభిమానులలో మొదలవుతున్నాయి. రామాయణ ట్రైలర్ టీజర్లో కాజల్ అగర్వాల్ కనిపించలేదు. ఇటీవలే సినిమా ప్రమోషన్స్ లో , ఈవెంట్స్ లో కూడా ఈమె ప్రస్తావన తీసుకురాలేదు.
also read:The Paradise:ధియేటర్ లలో ఫ్లాప్.. ఓటీటీలో దూసుకుపోతున్న ది ప్యారడైజ్!
ప్రమోషన్స్‌లో కనిపించని కాజల్..
దీంతో అసలు కాజల్ అగర్వాల్ రామాయణ సినిమాలో ఉందా లేదా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌లో చాలామంది కీలకమైన నటీనటులంతా పాల్గొన్నారు. కానీ కాజల్ అగర్వాల్ ఎక్కడ కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రామాయణం లో నటించిన సాయి పల్లవి, రణబీర్ కపూర్, యశ్, రకుల్ ప్రీతిసింగ్, సన్నీడియోల్ , వివేక్ ఒబెరాయ్ వంటి నటీనటుల సైతం ప్రమోషన్స్‌లో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. కానీ లారాదత్త, కాజల్ అగర్వాల్ మాత్రం ఈవెంట్స్ కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
also read:Anirudh :కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి? తెరపైకి వచ్చిన కీలక వివరాలు!
అసలు నిజం ఏంటంటే?
అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే లారా దత్త ప్రమోషన్స్ కి హాజరు కాకపోయినా చిత్ర బృందం ఆమె పేరుని ప్రస్తావించింది. కానీ కాజల్ అగర్వాల్ (kajal agarwal )విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సరైన స్పష్టత కనిపించడం లేదు. గతంలో కాజల్ అగర్వాల్ రామాయణ సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నట్లు అదికూడా రావణాసురుడు భార్య మండోదరిగా కనిపించబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఆమె పాత్రకు పెద్దగా స్క్రీన్ ప్రజెంట్ లేకపోవడంతో ప్రమోషన్స్ కి దూరంగా ఉందని టాక్ వినిపిస్తోంది. మరొకవైపు ఫైనల్ ఎడిటింగ్లు కాజల్ అగర్వాల్ పాత్రను తొలగించి ఉంటారేమో అనే ప్రచారం కూడా ఇప్పుడు వినిపిస్తోంది. దీనిపైన అధికారికంగా మేకర్స్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. సుమారుగా 3:15 గంటల నిడివితో దీపావళి సందర్భంగా ఈ సినిమా మొదటి భాగం రాబోతోంది. రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.




