Saturday, October 3, 2026
HomeLATESTBigg boss 10:బిగ్ బాస్ షో లోకి వైల్డ్ కార్డు ద్వారా బుల్లితెర నటి ఎంట్రీ..!

Bigg boss 10:బిగ్ బాస్ షో లోకి వైల్డ్ కార్డు ద్వారా బుల్లితెర నటి ఎంట్రీ..!

Bigg boss 10: ప్రముఖ బుల్లితెర సీరియల్ హీరోయిన్ ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Bigg boss 10:తెలుగు బిగ్ బాస్ 10వ సీజన్ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి అవ్వగా , ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం జరిగింది. తెలుగు బుల్లితెర పైన అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో గా పేరు సంపాదించిన బిగ్బాస్ షో రోజురోజుకి చాలా రసవత్తరంగా మారుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన మొదలైన ఈ షో ఇప్పుడు నాలుగో వారం ముగింపునకు చేరింది. రోజురోజుకి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య పోటీ తీవ్రత పెరుగుతూనే కనిపిస్తోంది.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న కావ్య శ్రీ..

వైల్డ్ కార్డు ఎంట్రీలకు కూడా బిగ్ బాస్(Bigg boss 10) టీమ్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది . ఈ క్రమంలోని ప్రముఖ సీరియల్ నటి గా పేరు సంపాదించిన కావ్య శ్రీ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మొదటివారం చైత్ర, రెండవ వారం కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా మూడో వారం నో ఎలిమినేషన్ జరిగింది. అయినా మిథిలేష్ బిగ్ బాస్ ఇచ్చిన సూట్ కేస్ ఆఫర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు..కానీ నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం అయితే జరుగుతోంది.

- Advertisement -
Advertisement

also read:Samantha:సమంత విషయంలో బాంబే హైకోర్టు సీరియస్..!

కావ్య శ్రీ తో పాటు మరికొంతమంది హౌస్ లోకి..

దీంతో బిగ్బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ మధ్య మరింత ఉత్కంఠ కనిపిస్తోంది. హౌస్ లో కాంట్రవర్సీ , వినోదం, పోటీ కూడా పెరిగేందుకు మరింత ఆస్కారం ఉంది. ఐదో వారం లేదా ఆరో వారంలో వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్స్ లోపలికి పంపించేలా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది. కావ్య శ్రీ తో పాటుగా మరి కొంతమందిని పంపించబోతున్నారు. చెఫ్ మంత్ర ప్రాజెక్టు కే షోలో కుకింగ్ చేస్తూ తన కామెడీతో ఆకట్టుకుంటున్న యాదమ్మ రాజుకు జోడిగా కావ్యశ్రీ పాల్గొనింది. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం కావ్యస్థానంలో యష్మీ రావడంతో వైల్డ్ కార్డు కోసమే కావ్య ఈ షోకే గుడ్ బై చెప్పినట్లు పలువురు అభిమానులు భావిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Varalakshmi Sarathkumar:తల్లి కావడంపై వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

అధికారిక ప్రకటన త్వరలోనే..

బిగ్బాస్ పదవ సీజన్ ప్రారంభం నుంచి కావ్య శ్రీ మెయిన్ కంటెస్టెంట్ గా వస్తుందని ప్రచారం జరిగినా.. కానీ హౌస్ లోకి రాకపోవడంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలిసి ఆమె అభిమానులు మరింత ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారు చూడాలి మరి. ఇందుకు సంబంధించి న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you