Sunday, August 23, 2026
HomeLATESTManchu Lakshmi :రాకా సినిమాపై మంచు లక్ష్మీ అదిరిపోయే అప్డేట్..!

Manchu Lakshmi :రాకా సినిమాపై మంచు లక్ష్మీ అదిరిపోయే అప్డేట్..!

Manchu Lakshmi : ప్రముఖ నటీమణి మంచు లక్ష్మి తాజాగా అల్లు అర్జున్ రాకా మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

on
- Advertisement -banner Ad
Manchu Lakshmi :స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య ప్రకటించిన చిత్రం రాకా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు.  ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమాని తీసేలా డైరెక్టర్ అట్లి ప్లాన్ చేశారు. అందుకు సంబంధించి ఒక వీడియోని కూడా విడుదల చేయగా అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అప్పుడప్పుడు పలు రకాల పోస్టర్లను కూడా విడుదల చేస్తున్నారు.

రాకా మూవీ నుంచి పలు విశేషాలు పంచుకున్న మంచు లక్ష్మి..

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాకా సినిమాకి సంబంధించి తాజాగా ప్రముఖ నటిగా పేరు సంపాదించిన  మంచు లక్ష్మి ముంబైలో రాకా సెట్ కి వెళ్ళాను అంటూ పలు విషయాలను తెలియజేస్తూ ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు క్షణాలలో వైరల్  చేస్తున్నారు. మంచు లక్ష్మి(Manchu Lakshmi )మాట్లాడుతూ..” బన్నీ బాంబేలో షూటింగ్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి పిలుస్తున్నారు రమ్మని.. కానీ నాకు కుదరలేదు. ఈరోజు వెళ్లాను. నేను ఇప్పుడే రాకా సినిమా షూటింగ్ సెట్ కి వెళ్లి వచ్చానని” తెలిపారు.

సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మంచు లక్ష్మి..

అంతేకాకుండా ఆ సెట్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.  నేను ఇంతకుముందు ఎన్నడూ చూడని వింతలు అందులో చూశాను. ఎన్నో రకాల కొత్త జీవరాసులు అక్కడ కనిపించాయి .అలాంటి జంతువులను గాని బన్నీ లాంటి మనుషులను గాని, ఇన్ని విభాగాలతో ఉన్న ఇలాంటి సెట్ ను కాని నేను ఎప్పుడు చూడలేదు.  నాకు వాటన్నిటిని చూసి చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా కోసం నేను ఆగలేక పోతున్నాను. ఎన్నో విషయాలను పంచుకోవాలని ఉంది.. కానీ పంచుకోలేకపోతున్నాను అంటూ మంచు లక్ష్మి వీడియోలో తెలియజేసింది.

వైరల్ అవుతున్న మంచు లక్ష్మీ వీడియో..

దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా మంచు లక్ష్మికి ధన్యవాదాలు తెలుపుతూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ రాకా సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ బర్త్ డే కి విడుదల చేసిన పోస్టర్తో మరింత ఆసక్తి పెంచేసింది. రాకా సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మరి రాకా సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you