Nani The Paradise:నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ది ప్యారడైజ్. ఇందులో హీరోయిన్గా కయాదులోహార్ నటిస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరు నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందించడం గమనార్హం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయకుండానే డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల చేసేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు చిత్ర బృందం.
నాని ప్యారడైజ్ మూవీ కి సెన్సార్ రివ్యూ..
ది ప్యారడైజ్(Nani The Paradise) చిత్రానికి సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్, గ్లింప్స్ లో ఎక్కువగా కొన్ని బూతు పదాలు కనిపించాయి. దీంతో ఈ యాక్షన్ సినిమాలో అదే ఎక్కువగా ఉంటాయేమో అని అనుకున్నారు. కానీ సెన్సార్ సభ్యులు మాత్రం సినిమాలో తల్లి కొడుకుల ఎమోషన్ సీన్స్, బలమైన ఎపిసోడ్ వంటి వాటిలో చూపించిన ఎమోషన్ సీన్స్ చూసి షాక్ అయ్యామని తెలుపుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చాలా బజ్ ఉంటుందని. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే జైలు ఫైట్ సీన్ అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ బాగా వర్క్ ఔట్ అయ్యాయని తెలుస్తోంది.
ALSO READ:Sneha:స్నేహ చిరకాల కోరికను తీర్చనున్న మెగాస్టార్ చిరంజీవి?
సెకండ్ హాఫ్ పై ఊహించని బజ్..
సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ మీద డైరెక్టర్ శ్రీకాంత్ ఫోకస్ చేశారని అలాగే ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడంతో శ్రీకాంత్ ఓదెల చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి చాలా తక్కువ కట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నాని కూడా స్టన్నింగ్ మేకవర్ తో షాక్ అయ్యేలా కనిపిస్తారని, అనిరుధ్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి హైలైట్ గా ఉంటుందట. అలాగే చాలా తక్కువ కట్స్ తో 2 గంటల 49 నిమిషాల నిడివి తో ఈ సినిమా ఉన్నది.
ALSO READ:BIGG BOSS-10:బిగ్‌బాస్ ఝాన్సీపై ట్రోల్స్.. రంగంలోకి దిగిన తల్లి.. నెటిజన్లకు గట్టి వార్నింగ్!
రికార్డ్స్ గ్యారెంటీ..
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో గతంలో వచ్చిన దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో వీరి నుంచి మరో సినిమా అనౌన్స్మెంట్ రావడంతో సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తదుపరి సినిమాల విషయానికి వస్తే బ్లడీ రొమియో చిత్రంతో పాటుగా మరికొన్ని చిత్రాలలో నటించనున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాలతో సెప్టెంబర్ 24 న ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి ఈ సినిమాతో నాని తన కెరీర్ లోనే ఎలాంటి సరికొత్త రికార్డులను ఈ చిత్రంతో తిరగ రాస్తారో చూడాలి మరి.




