O.M Movie Review: కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి, యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఓం: ఆపరేషన్ మోల్’ (O.M: Operation Mole) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అమరన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి తొలిసారి కలిసి నటించడం, సాయి పల్లవి పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?
also read:Pujitha ponnada:ఆదర్శకుటుంబం టీమ్ మోసం చేసిందని ఆరోపణలు చేస్తున్న నటి పూజిత..!
కథ :
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నడిపించే బర్మా కార్తికేయన్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తారు. ఈ మాఫియాను అంతం చేయడానికి పోలీస్ శాఖ ఒక రహస్య ఆపరేషన్ చేపడుతుంది. ఇందులో భాగంగా అండర్‌కవర్ పోలీస్ అధికారిగా ధనుష్ స్మగ్లింగ్ ముఠాలోకి ప్రవేశిస్తారు. మరోవైపు ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డిగా సాయి పల్లవి ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తారు. ధనుష్ భార్య రోజా పాత్రలో శ్రీలీల కనిపిస్తారు.
అయితే ఈ రహస్య ఆపరేషన్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? స్మగ్లింగ్ మాఫియా వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను పోలీసులు ఎలా ఛేదించారు? ధనుష్, మమ్ముట్టి పాత్రల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? చివరకు ఆపరేషన్ మోల్ లక్ష్యాన్ని చేరుకుందా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ :
దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఎంచుకున్న ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. క్రైమ్, పోలీస్ ఆపరేషన్, యాక్షన్ అంశాలను కుటుంబ భావోద్వేగాలతో మేళవించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, కీలక పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తున్నాయి. సాయి పల్లవి పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం కొంత మైనస్‌గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కథలోని ఉత్కంఠ, కీలక మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
also read: Rashmi Gautam: నా ఫ్యామిలీ చచ్చినా పర్లేదు.. యాంకర్ రష్మీ సంచలన పోస్ట్..!
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
ధనుష్ తన సహజమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. అండర్‌కవర్ పోలీస్ అధికారిగా ఆయన చూపించిన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని అంటున్నారు.
మమ్ముట్టి తన అనుభవంతో కూడిన నటన, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి కలిసి కనిపించే సన్నివేశాలు అభిమానులకు మంచి హై ఇస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.
సాయి పల్లవి ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటన సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు.
ఇక శ్రీలీల తన రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు భిన్నంగా రోజా పాత్రలో కనిపించడం ఆసక్తిని పెంచింది. కొత్త లుక్, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
టెక్నికల్ టీమ్ :
దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కథను యాక్షన్ థ్రిల్లర్‌గా మలిచే ప్రయత్నం చేశారు. స్మగ్లింగ్ మాఫియా నేపథ్యానికి తగినట్టుగా కథనాన్ని రూపొందించారు. యాక్షన్ సన్నివేశాలు, ప్రధాన పాత్రల ఎలివేషన్ సినిమాకు ప్లస్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి వంటి ఇద్దరు బలమైన నటులను ఒకే తెరపై చూపించడం మంచి ప్రయత్నం. అయితే సెకండాఫ్‌లో కథనం వేగం కొంత తగ్గింది.
ప్లస్ పాయింట్స్ :
– ధనుష్, మమ్ముట్టి క్రేజీ కాంబినేషన్
– సాయి పల్లవి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర
– ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం
– ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు
– కీలక పాత్రల నటన
– ఆసక్తికరమైన కథా మలుపులు
మైనస్ పాయింట్స్ :
– సెకండాఫ్‌లో నెమ్మదించే కథనం
– కొన్ని సన్నివేశాల్లో సాగదీత
– కొన్ని చోట్ల ఊహించగలిగే కథనం
పంచ్ లైన్ : ధనుష్, మమ్ముట్టి నట విశ్వరూపం.. సాయి పల్లవి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. ‘ఓం’తో ఆపరేషన్ థ్రిల్!




