Thursday, November 19, 2026
HomeLATESTActress Diya Mirza:బాలీవుడ్ నటుడు పై.. నటి దియా మీర్జా సంచలన కామెంట్స్!

Actress Diya Mirza:బాలీవుడ్ నటుడు పై.. నటి దియా మీర్జా సంచలన కామెంట్స్!

Actress Diya Mirza: ప్రముఖ బాలీవుడ్ నటి దియామీర్జా తాజాగా నవాజుద్దీన్ సిద్ధికి పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Actress Diya Mirza:ఈమధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రెటీలు తమకు తోచిన విధంగా మాట్లాడుతూ ఎప్పుడో జరిగిన విషయాలను కూడా బయట పెడుతూ.. ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతున్నారు.. బాలీవుడ్ లో ఎప్పుడు కూల్ గా హుందాగా కనిపించేటటువంటి నటి దియా మీర్జా ఒక్కసారిగా తన సహనాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి పై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు సైతం ఇప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమలో దుమారాన్ని రేపుతున్నాయి.

నవాజుద్దీన్ సిద్ధిఖిపై మండిపడ్డ నటి దియా మీర్జా..

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే నదియా.. ఇప్పుడు ఏకంగా నవాజుద్దిన్ ను ట్యాగ్ చేస్తూ మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రవర్తన పైన దియామీర్జా(Actress Diya Mirza) తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.. ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగానే ఒక పీడకల వంటిది. కనీసం మాట్లాడే పద్ధతి కూడా తెలియదు. యాటిట్యూడ్ అయితే ఏకంగా ఆకాశాన్ని తాకుతుంది.. అత్యంత అభ్యంతరకరమైన పాత్ర ఇది అంటూ దియా రాసుకొచ్చిన పోస్టు వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Amala Akkineni:ఇద్దరి కోడళ్ల గురించి నిజాలు చెప్పేసిన అమల..!

స్పందించిన నవాజుద్దీన్ సిద్ధిఖి..

నటి దియా మీర్జా.. ఎప్పుడు కూల్ గా ఉండే నటి. అలాంటి ఆమె నోటి నుంచి ఇలాంటి తీవ్రమైన మాటలు రావడంతో ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక చర్చగా మొదలైంది.. అయితే ఈ విషయం పైన నటుడు నవాజుద్దీన్ సిద్ధఖీ స్పందిస్తూ ఆమె పోస్టుకు రిప్లై ఇస్తూ.. ఒకరి యాటిట్యూడ్ లో లోపాలు వెతకడం చాలా తేలిక.. దమ్ముంటే నా పనిలో తప్పులు వెతకండి అంటూ సవాలు విసిరారు.. ఇలా ఇద్దరి నటుల మధ్య మొదలైన ఈ మాటలు యుద్ధం క్షణాలలో వైరల్ గా మారింది. వీరు చేసిన పని వల్ల పలువురు నెటిజన్స్ సైతం భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:కాకా సినిమాలో అనస్వర రాజన్ పాత్ర అదేనా..?

పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా?

దియా తన పోస్టులో వాడిన పాత్ర (క్యారెక్టర్) అనే పదం కొంతమంది నెటిజెన్స్ సైతం హైలెట్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి రోహన్ నిప్పి దర్శకత్వంలో రాబోతున్న ఒక మెడికల్ డ్రామా వెబ్ సిరీస్లో నటించబోతున్నారు. ఇందులో నవాజుద్దీన్ డాక్టర్ పలక్ జైన్ గా కనిపించబోతున్నారు . డిసెంబర్ 27న జియో హాట్ స్టార్ లో రాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసి ఉంటారని పలువురు నెటిజన్స్ భావిస్తున్నారు. కేవలం ప్రమోషన్స్ లో భాగమని పబ్లిసిటీ కోసమే ఇలా చేశారంటు మరి కొంతమంది విశ్లేషకులు సైతం కామెంట్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో మొదలైన ఈ వార్ మాత్రం రాబోయే వెబ్ సిరీస్ పైన మరింత అంచనాలను పెంచేసేలా చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ మాత్రం వైరల్గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you