Thursday, November 19, 2026
HomeLATESTAmala Akkineni:ఇద్దరి కోడళ్ల గురించి నిజాలు చెప్పేసిన అమల..!

Amala Akkineni:ఇద్దరి కోడళ్ల గురించి నిజాలు చెప్పేసిన అమల..!

Amala Akkineni: ప్రముఖ హీరోయిన్ అమల అక్కినేని తాజాగా తన ఇద్దరు కూతుర్ల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Amala Akkineni:అక్కినేని కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో ఒక చెరగని ముద్ర వేసుకుంది. ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాలకు స్థానం కల్పించకుండా.. తమ పని తాము చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఏఎన్ఆర్ తర్వాత.. నాగార్జున, ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అటు నాగ చైతన్య రెండవ వివాహం శోభిత ధూళిపాళ్లను చేసుకోగా, అఖిల్ జైనబ్ ను వివాహం చేసుకున్నారు. ఇటువంటి సందర్భంలోనే అక్కినేని అమల ఇంటర్వ్యూలో పాల్గొని ఇద్దరు కోడళ్లు అడుగుపెట్టినప్పటి నుంచి తమ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

కోడళ్ల రాకతో మా ఇంట్లో సందడి నెలకొంది..

మా ఇంట్లో ఇన్ని రోజుల పురుషులు ఎక్కువగా ఉండేవారు. అయితే ఇప్పుడు నాగచైతన్య భార్య శోభిత, అఖిల్ భార్య జైనబ్ రావడంతో ఇంట్లో మహిళల సందడి మొదలయ్యింది అంటూ తెలిపింది. అలాగే ఇద్దరి కోడళ్ళతో తనకు ఉన్న అనుబంధం గురించి , అలాగే అఖిల్ భార్య జైనబ్ గురించి, ప్రత్యేక శ్రద్ధ గురించి పలు విషయాలను పంచుకున్నది. అఖిల్ భార్యతో తనకు మరింత దగ్గర అనుబంధం ఉందని అమల(Amala Akkineni) ఓపెన్ గానే చెప్పేశారు. అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్నప్పుడే తను ఆమెను కలిశానని , అప్పటినుంచి తన వ్యక్తిత్వం ఎంతో నచ్చిందని తెలిసింది.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:కాకా సినిమాలో అనస్వర రాజన్ పాత్ర అదేనా..?

జైనబ్ చాలా ప్రేమగా చూసుకుంటుంది..

జైనబ్ చాలా ప్రేమగా, ఆప్యాయకరంగా మాట్లాడుతుంది.. తనకు సొంత కూతురులా అనిపిస్తుంది. తనకంటే ఎక్కువగా తన ఆరోగ్యం అవసరాల గురించి జైనబ్ శ్రద్ధ తీసుకుంటుందని.. నాగార్జునను కూడా చాలా బాగా చూసుకుంటారని తెలియజేసింది. అంతేకాకుండా జైనబ్ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తమ ఇంట్లో ఒక పండుగ వాతావరణంలా మారిపోయిందని, గతంలో పండుగలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే వాళ్లము కానీ జైనబ్ వచ్చాక ప్రతి పండుగను చాలా ఘనంగా సరికొత్త ఉత్సాహంతో చేసుకుంటున్నామని తెలియజేసింది అమల.

- Advertisement -
Advertisement

also read:Balakrishna:ధోని ఐపీఎల్ కి గుడ్ బై.. బాలయ్య వీడియో వైరల్..!

పెద్ద కోడలిపై ప్రశంశలు..

మరొకవైపు పెద్ద కోడలు శోభిత గురించి మాట్లాడుతూ.. శోభిత కెరియర్ లో సాధించిన విజయాలను అభినందిస్తూ ఆమె ఎంతో ఆప్యాయకరంగా ఉంటుంది.. కుటుంబంలో ప్రతి ఒక్కరితో చాలా సులువుగా కలిసిపోతుందని, అత్తగా ఉండడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. ఇంతకుముందు అందరూ ఇంట్లో మగవాళ్లే ఉండేవారని, ఇప్పుడు తనకు ఇద్దరు కూతుర్లు వచ్చారంటూ అమల ఆనందంగా తెలియజేసింది. ఈ విషయం అటు అక్కినేని అభిమానులను మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం అమలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కింగ్ 100వ చిత్రంలో నటిస్తున్నారు. నాగచైతన్య వృషకర్మ అనే చిత్రంలో నటిస్తున్నారు. అఖిల్ చివరిగా లెనిన్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తదుపరి సినిమాని ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you