Thursday, October 1, 2026
HomeLATESTRanya rao:నటి రన్యా రావుకు భారీ షాక్ ఇచ్చిన అధికారులు..!

Ranya rao:నటి రన్యా రావుకు భారీ షాక్ ఇచ్చిన అధికారులు..!

Kannada Actress: కన్నడ నటి రన్యా రావు కి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు ఏకంగా 89 కోట్లకు పైగా జరిమానా విధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

on
- Advertisement -banner Ad

Ranya rao:కన్నడ నటి రన్యా రావు పలు చిత్రాలలో నటించినా.. ఆమె నటిగా కంటే బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. కేసులో చిక్కుకోవడంతో ఈమె పేరు భారీ పాపులారిటీ సంపాదించుకుంది. 2025 మార్చి మూడున బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి బెంగళూరుకి వస్తున్న సమయంలో రన్యా రావును DRI అధికారులు అడ్డుకొని ఆమెను తనిఖీలు చేయగా.. ఆమె వద్ద భారీగా బంగారం బయటపడినట్లు తెలియజేశారు. ముఖ్యంగా ఆమె ప్రత్యేకించి తయారు చేయించుకున్న దుస్తులలో సుమారుగా 14.213 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రన్యా రావు ఇంట్లో భారీగా పట్టుబడిన బంగారం..

అయితే ఆమె వద్ద పట్టుబడిన బంగారం విలువ అప్పటికి సుమారుగా 12.56 కోట్ల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో రన్యా రావును (Ranya rao)అరెస్టు చేసి విచారణ చేయడం మొదలుపెట్టారు. ఎయిర్పోర్ట్లు బంగారు పట్టు పడడంతో ఆ కేసు ఆగలేదు ఆమె నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించగా , ఆ సోదాలో 2.67 కోట్ల రూపాయల నగదు తో పాటుగా రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడి అధికారులు తెలియజేశారు. దీంతో ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన బంగారం వెనుక కూడా పెద్ద నెట్వర్క్ ఉందని అనుమానాలతో ఆ దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించారు.

- Advertisement -
Advertisement

also read:YouTuber Nandana:నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. యూట్యూబర్ నందు కామెంట్స్ ..!

100 కోట్లకు పైగా విలువ..

ఆ దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఎన్నో విషయాలు బయటపడినట్లు ఈడి అధికారులు తెలియజేస్తున్నారు.
రన్యా రావు చాలాసార్లు దుబాయ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి బంగారం కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని 2024 మార్చి నుంచి 2025 మార్చి మధ్యలోనే.. 127.287 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించారు. అయితే ఆమె తీసుకువచ్చిన ఆ బంగారం విలువ సుమారుగా 100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారం మొత్తాన్ని దేశీయ మార్కెట్లో ఉంచి వచ్చిన నగదును హవాలా మార్గంలో మళ్ళించినట్లుగా ఈడి అధికారులు గుర్తించారు.

- Advertisement -
Advertisement

also read:Radhika Sarathkumar:సోషల్ మీడియాపై నటి రాధిక శరత్ కుమార్ ఫైర్..!

ఏడాది పాటు జైలు జీవితం..

ఈ కేసులో రన్యా రావు తో పాటుగా తరుణ్ కొండూరు, సాహిల్ సాకారియా జై తదితర పేర్లు కూడా వినిపించాయి. బంగారం స్మగ్లింగ్ తో పాటుగా మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును వివిధ మార్గాల ద్వారా చట్టబద్ధమైన లావాదేవీలుగా చూపించే ప్రయత్నం కూడా చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ రన్యా రావు కేసుకు సంబంధించి 35 కోట్ల ఆస్తులను కూడా ఈడీ అధికారులు తాత్కాలికంగా అటాచ్ చేశారు. రన్యా రావు బెయిల్ ప్రక్రియ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. COFEPOSA చట్టం ద్వారా ఈమెను ఏడాది పాటు నిర్బంధించారు. మళ్లీ స్మగ్లింగ్ కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉన్నందువలన నిరోధక చర్యగా ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

- Advertisement -
Advertisement

89 కోట్లకు పైగా జరిమానా..

ఈ విషయం పై రన్యా రావుకు కోర్టులో సవాల్ చేసింది.. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. COFEPOSA కింద ఏడాది కాలం పాటు ఉంచినప్పటికీ 2026 ఏప్రిల్ 22న పూర్తి అవ్వడంతో ఆమె జైలు నుంచి రిలీజ్ అయింది. అయితే ఆ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులు మరొక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. రన్యా రావుకు 89 కోట్ల 91 లక్షల జరిమానా ను కస్టమ్స్ శాఖ పెనాల్టీగా విధించారు. సుమారుగా 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి మధ్యలో ఈమె 110 కిలోలకు పైగా బంగారాన్ని దుబాయ్ నుంచి ఇండియాకు చాలా అక్రమంగా తరలించినట్లు తాజా కస్టమ్స్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఒకవైపు కోర్టులో కేసు మరొకవైపు కోట్ల రూపాయల జరిమానా తో రన్యా రావుకు సతమతమవుతోంది.మరి ఈ కేసులో తుది పరిణామాలు ఎలా ఉంటాయనే విషయం చూడాలి మరి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you