OTT Platforms: ఇప్పుడు OTTలు డెమోక్రటిక్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కమర్షియల్ రూటునే ఎంచుకుంటున్నాయి. సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఉన్నప్పటికీ, చిన్న నిర్మాతలకు అవకాశం దక్కాలంటే మాత్రం కేవలం కథ సరిపోదు, మార్కెట్ స్టామినా కూడా తెలిసుండాలి. అన్నింటికంటే ముఖ్యంగా కంటెంట్ ప్రధానంగా ఉంటేనే ఓటీటీలు ముందుకు వస్తున్నాయి. ఇంతకు ముందులా సినిమా రైట్స్‌ని ఎలా పడితే అలా తీసుకోవడం లేదు. దీంతో సినిమాలు థియేటర్లలో సక్సెస్ అయినా కూడా ఓటీటీ డీల్ మాత్రం ముగియడం లేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నాయి. స్టార్ హీరో పేరు వినిపిస్తే ఇంతకు ముందు డీల్ క్లోజ్ అయ్యేది. కానీ, ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ సంస్థలకు (OTT Platforms) ఝలక్ ఇస్తున్నాయి. అందుకే ప్రతి ఓటీటీ సంస్థ ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. రాబోయే రోజుల్లో కేవలం కంటెంట్ ఉన్నవారికే కాదు, బిజినెస్ సెన్స్ ఉన్న వారికే OTT బాటలు సుగమం అవుతాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
పెద్ద నిర్మాణ సంస్థల ఆధిపత్యం
స్టార్ హీరోల సినిమాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న ఓటీటీ సంస్థలు.. కేవలం కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలకే ప్రాధాన్యతను ఇస్తున్నాయా? అంటే, అవుననే చెప్పాలి. ఒకప్పటిలా ‘ఓపెన్ ఫర్ ఆల్’ విధానానికి స్వస్తి చెబుతూ.. లెక్కలతో కూడిన పెట్టుబడుల వైపు మళ్లాయి. ఇక పెద్ద నిర్మాణ సంస్థలు అంటే, ఇండస్ట్రీకి ఫీడింగ్ ఇచ్చేవి. కోట్లలో సినిమాలు చేస్తుంటాయి, అందులోనూ స్టార్ హీరోల డేట్స్ ఎప్పుడంటే అప్పుడు వాళ్లకు వస్తుంటాయి. అందుకే వారి విషయంలో ఓటీటీ సంస్థలు కన్సాలిడేషన్ కనిపిస్తూనే ఉంది. ఇది టాలీవుడ్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలలో ఈ విధానమే నడుస్తోంది.
Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం
రిస్క్ వద్దనుకుంటున్నారు (OTT Platforms)
ఓటీటీ సంస్థల యజమానులు ముఖ్యంగా ఇదే ఆలోచిస్తున్నారు. రిస్క్ చేయడానికి అస్సలు వెనుకాడటం లేదు. ప్రయోగాత్మక సినిమాల కంటే కూడా కచ్చితమైన ఫలితాన్ని ఇచ్చే పెద్ద బ్యానర్లు, స్టార్ డైరెక్టర్స్ సినిమాలపైనే ఇంట్రస్ట్ పెడుతున్నారు. చిన్న సినిమాలు సక్సెస్ అయినా, చిన్న నిర్మాణ సంస్థలు నిర్మించిన సినిమాల విషయంలోనూ ఓటీటీ సంస్థలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఒకప్పుడు కథ గురించే ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు మార్కెట్‌లో ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉందనేది పరిగణనలోకి తీసుకుంటున్నారు. పెద్ద బ్యానర్స్ చేసే సినిమాలకు ఎలాగూ క్రేజ్ ఉంటుంది కాబట్టి, వారికి ఈజీగా పనైపోతుంది.
Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?
మోసాలకు అడ్డుకట్ట
ఇంతకు ముందు ఓటీటీ సంస్థలు ఆయా ఇండస్ట్రీలలోని కొంతమంది ప్రముఖులను వారి ఏజెంట్స్‌గా పెట్టుకునే వారు. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఈ క్రమంలో వారు మోసాలు చేయడం కూడా స్టార్ట్ చేశారు. సినిమాలో కంటెంట్ లేకపోయినా, ఫ్యాన్సీ ధరను చెల్లించడం గమనించిన ఓటీటీ సంస్థల యజమానులు.. ఏజెంట్స్‌కు చెక్ పెడుతూ.. స్వయంగా వారే ఇప్పుడు రంగంలోకి దిగారు. అందుకే, ఇదివరకులా ఓటీటీ డీల్స్ అంత ఈజీగా క్లియర్ అవడం లేదు.
Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం
అందుకే ‘ప్రీమియమ్’
ఇప్పుడు ఓటీటీ సంస్థలు కేవలం సబ్‌స్క్రిప్షన్‌తోనే ఆగకుండా, రైట్స్ కోసం పెట్టిన అధిక ధరలు రాబట్టుకునే క్రమంలో ప్రీమియమ్ వీడియో ఆన్ డిమాండ్ పేరిట.. ముందుగానే డబ్బులు కట్టి చేసేలా ప్లాన్ చేస్తున్నాయి. ఒక వారం, పది రోజుల తర్వాత మళ్లీ సబ్‌స్క్రిప్షన్ లైబ్రరీలోకి ఆ సినిమాలను తీసుకు వస్తున్నారు. అలాగే సబ్‌స్క్రిప్షన్ ధరలు తగ్గించి యాడ్స్ అధికంగా ఉండేలా ప్లాన్‌లను ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారుడిని ఆకర్షించేలా ప్లాన్‌లను పెట్టి, తర్వాత యాడ్స్‌తో సొమ్ము చేసుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే.. క్రియేటివిటీ కంటే కమర్షియల్‌కే ఓటీటీ సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. కేవలం కథ, కంటెంట్ మాత్రమే కాదు, అనిల్ రావిపూడిలా మార్కెట్ స్ట్రాటజీ కూడా తెలిసి ఉండాలి. ఇలా బిజినెస్ సెన్స్, స్ట్రాటజీ ఉన్న వారికే ఓటీటీ సంస్థ మార్గం తెరుస్తున్నాయి. ముందు ముందు మరింతగా ఓటీటీ నియమాలు మరింత కఠినతరం కాబోతున్నాయి. మరి వీటికి అడ్డుకట్ట వేయడానికి నిర్మాతలు ఎలాంటి మార్గాన్ని ఎన్నుకుంటారనేది చూడాల్సి ఉంది.
Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?


