Wednesday, July 22, 2026
HomeLATESTPooja Hegde:పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే.. అదృష్టం కలిసొచ్చేనా?

Pooja Hegde:పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే.. అదృష్టం కలిసొచ్చేనా?

Pooja Hegde: పవన్ కళ్యాణ్ ఓ జి 2 సినిమాలో పూజా హెగ్డే నటించబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Pooja Hegde:టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం మాత్రం ఓజీ 2 సినిమా చేసే పనిలో పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పనులు జరుగుతున్నట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల తమన్ డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ ని కలిశారు.

పవన్ కళ్యాణ్ సినిమాలో పూజా హెగ్డే..

ఇదంతా ఇలా ఉండగా ఓజీ 2 సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారనే విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే (Pooja Hegde)నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్డం సంపాదించడమే కాకుండా స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బాగానే సినిమాలలో నటిస్తూ పేరు సంపాదించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Raghava Lawrence:రూమర్స్‌కు ఫుల్ స్టాప్… తిరుచ్చి ఈస్ట్ పోటీపై లారెన్స్ క్లారిటీ!

అందుకే మరో అవకాశం..

ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న పూజా హెగ్డే కు పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే అది అదృష్టమే అని చెప్పవచ్చు. అయితే గతంలో కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా మొదట హీరోయిన్గా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల చేత ఆమె స్థానంలో హీరోయిన్ శ్రీ లీల ని ఎంపిక చేశారు. అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు పూజ హెగ్డే పేరు ఓజి 2 లో వినిపిస్తోంది మరి ఈ విషయం పైన అధికారికంగా ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement

ALSO READ:Lenin trailer: ఆకట్టుకుంటున్న అఖిల్ లెనిన్ ట్రైలర్.. అక్కినేని ఫ్యాన్స్ చూశారా?

పూజా హెగ్డే కి అదృష్టం కలిసొస్తుందా?

పూజ హెగ్డే తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు సినిమాలలో నటించడమే కాకుండా తనకి పాత్ర నచ్చితే స్పెషల్ సాంగ్లు చేయడానికి అయినా సరే సిద్ధంగానే ఉంది. రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలోని స్పెషల్ సాంగ్ తో కూడా మరింత క్రేజ్ సంపాదించుకుంది. మరి అన్ని అనుకున్నట్టుగా జరిగితే పవన్ కళ్యాణ్ ఓజి 2 సినిమాతో పూజ హెగ్డే కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you