Poonam Kaur:తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో కంటే వివాదాలలోనే ఎక్కువగా ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. పేర్లు ప్రస్తావించకుండా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు పెడుతూ నిరంతరం వార్తలలో నిలుస్తున్న పూనం కౌర్ ఇప్పుడు తాజాగా చేసిన కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
త్రివిక్రం పై ఇండైరెక్టుగా కామెంట్ చేసిన పూనం..
పూనం కౌర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో.. “ఏమాత్రం ఆదర్శం లేని.. 100 శాతం పబ్లిసిటీ చేసుకునే ఈ డైరెక్టర్ భారీ నుంచి నటీనటులను, నిర్మాతలను ఆ దేవుడే కాపాడాలి. మూఢనమ్మకాలు , హనీ ట్రాప్ వంటి వాటితో తన జీవితాన్ని గడిపేస్తున్నాడు.. ఈ వ్యక్తికి అసలు ఎలాంటి ఆదర్శం లేదు.. కాబట్టి ఇతనికి దూరంగా ఉండండి. ఆ తాంత్రికుడు , నకిలీ గురువు నుంచి ఆ అమాయకులను ఆ దేవుడే కాపాడాలి” అంటూ పూనమ్ కౌర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక స్టోరీ షేర్ చేసింది. ఆ తర్వాత.. AK అనేది మరో నటుడు విషయంలో అజ్ఞాతవాసి లాంటిది అంతే అంటూ మరో పోస్ట్ షేర్ చేసింది.
also read:Ram Charan :చరణ్ కోసం కత్తిలాంటి హీరోయిన్ సెట్ చేసిన సుక్కు.. క్రేజీ కాంబో మావ ఇది!
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు..
తాజాగా పూనం కౌర్ షేర్ చేసిన పోస్టులు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, అయితే ఆమె ఎవరి పేరును ప్రస్తావించనప్పటికీ ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీలను చూస్తూ ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం సినిమా గురించి అంటూ పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆదర్శ కుటుంబం AK -47 ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొకసారి ఈ సినిమా వాయిదా పడింది.. అక్టోబర్ 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా, వాయిదా పడడంతో పూనమ్ కౌర్ ఇలా పరోక్షంగా పోస్టులు షేర్ చేశారనే విధంగా పలువురు నేటిజన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
also read:Varshini:బిగ్ బాస్‌లో వర్షిణి ఎమోషనల్.. ముకేశ్‌తో బంధంపై అసలు విషయం చెప్పేసింది!
పేరు ప్రస్తావించకపోయినా అతనే టార్గెట్..
త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి పేర్లను ప్రస్తావించడంలో కచ్చితంగా ఆదర్శ కుటుంబం..AK 47 సినిమాని ఉద్దేశించి పూనం(Poonam Kaur) ఇలాంటి పోస్టులు షేర్ చేసిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూనం కౌర్ ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సందర్భాలలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పలు రకాలుగా ట్వీట్స్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే . వారి పైన పోస్ట్‌లు పెట్టడంతో పెద్ద దుమారం కూడా రేపుతూ ఉంటాయి . ఇప్పుడు ఆదర్శం లేని డైరెక్టర్ అంటూ ఇండైరెక్టుగా త్రివిక్రమ్ నే టార్గెట్ చేస్తూ షేర్ చేసిన ఈ పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఆదర్శ కుటుంబం విడుదల తేదీ ఎప్పుడంటే?
ఆదర్శ కుటుంబం సినిమా పోస్ట్ పోన్ అవుతుందని నిర్మాత నాగవంశీ కూడా వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తామని వెల్లడించారు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 30వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొంత భాగం షూటింగ్ పెండింగ్ ఉండడంతో రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారని సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరో గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.




