Thursday, October 1, 2026
HomeLATESTPrabhash:ప్రభాస్ సినిమాకి టికెట్స్ ఇవ్వలేదని థియేటర్ని కొనేసిన నిర్మాత..!

Prabhash:ప్రభాస్ సినిమాకి టికెట్స్ ఇవ్వలేదని థియేటర్ని కొనేసిన నిర్మాత..!

Prabhash: ప్రభాస్ మిర్చి సినిమా కోసం థియేటర్ కి వెళ్తే అక్కడ టికెట్ ఇవ్వలేదని బాధపడిన ఆ వ్యక్తి ఏకంగా అదే తీయకరణ కొనుగోలు చేశానని తెలిపాడు.

on
- Advertisement -banner Ad

Prabhash:సినీ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలలో.. జరిగిన కొన్ని విషయాలు తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోతుంటారు. అలా ఈవారం థియేటర్లో విడుదలవుతున్న ఎనిమిది చిత్రాలలో చిన్న సినిమాగా విడుదలవుతున్న అనకాపల్లి సినిమా కూడా ఒకటి. ఇందులో విక్రమ్ సాహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం కలిసి యాంకర్ సుమాతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు.

సినిమా టికెట్ ఇవ్వలేదని థియేటర్ కొన్నాను..

అయితే ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్(Prabhash) సినిమాకి టికెట్ ఇవ్వలేదని ఏకంగా థియేటర్ ని కొనేశానంటూ ప్రముఖ నిర్మాత కాండ్రేగుల నాయుడు తెలియజేశారు. అసలు విషయంలోకి వెళితే.. డైరెక్టర్ కొరటాల శివ, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా మిర్చి. ఈ చిత్రం 2013లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకి టికెట్లు దొరకకపోవడంతో ఆ థియేటర్ ని కొనుగోలు చేశానంటూ కాండ్రేగుల నాయుడు తెలియజేశారు. మిర్చి సినిమాకి అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి క్రేజీ ఉండేది . అనకాపల్లిలో వెంకటేశ్వర థియేటర్ లో చిత్రాన్ని చూడడానికి కుటుంబంతో కలిసి వెళ్లాను.. టికెట్స్ కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబెట్టారని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Mahesh Babu:డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. మూవీపై మహేష్ రివ్యూ..!

రియల్ ఎస్టేట్లో రవితేజ మూవీస్ స్పూర్తి..

అలా నిలబెట్టిన సమయంలోనే తాను ఎప్పటికైనా ఈ థియేటర్ ని కొనియాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అలా అనుకున్నట్టుగానే ఆ థియేటర్ను కూడా కొనేశాను ఇప్పుడు అదే థియేటర్లో నేను నిర్మించిన అనకాపల్లి సినిమా కూడా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ కాండ్రేగుల నాయుడు తెలిపారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మంచి విజయం సాధించారు. తాను రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావడానికి ముఖ్య కారణం రవితేజ నటించిన భగీరథ సినిమా స్ఫూర్తి అంటూ తెలిపారు. రవితేజ ఆ సినిమాలో 5 లక్షల రూపాయలు చెక్కు తీసుకొని రియల్ ఎస్టేట్ ఎలా మొదలుపెట్టి పెద్దవారయ్యారో.. నిజజీవితంలో కూడా తాను అలాగే ఎదిగానని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Irumudi movie: వరదల్లో కొట్టుకుపోయిన ఇరుముడి మూవీ బ్రిడ్జి.. వీడియో వైరల్..!

రిలీజ్ డేట్ మార్చుకున్న అనకాపల్లి మూవీ..

సినిమాల పైన తనకున్న ప్రేమే అనకాపల్లి చిత్రాన్ని రూపొందించడానికి ముఖ్య కారణం అయిందని.. అనకాపల్లి చిత్రాన్ని ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు.. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ , స్క్రీన్ ప్లే అందించారని ఈ చిత్రం రా అండ్ రస్టిక్ గా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత తరం ఉన్న పిల్లలు కొన్ని వ్యసనాలకు బానిస అవుతారు. దానివల్ల తల్లితండ్రులు ఎలా ఇబ్బంది పడతారు అనే విషయాన్ని సినిమాలో చూపించామని తెలిపారు. వాస్తవంగా అనకాపల్లి చిత్రాన్ని ఆగస్టులోనే రిలీజ్ చేయాలని డేట్ కూడా విడుదల చేసాం కానీ బాక్సాఫీస్ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో ప్రజలకు తమ సినిమా ప్రదర్శించే అవకాశం మిస్ అవుతుందని ఇప్పుడు తెలుగుతోపాటు తమిళంలో కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you